ఈడీపైనే కేసులా ? సుప్రీంలో మమతకు బిగ్ షాక్..!
పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీతో జరుగుతున్న పోరులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్ సర్కార్ కు చుక్కెదురైంది. కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ జరిపిన దాడుల తర్వాత బెంగాల్ పోలీసులు నమోదు చేసిన కేసులపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
ఇదే వ్యవహారంలో బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో సహా ఇతర అధికారుల్ని సస్పెండ్ చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది & శిక్షణ శాఖ, మమతా బెనర్జీ, బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వివరణలు కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్‌కు కూడా కోర్టు సమాధానం కోరింది.

అవినీతి కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాలను నిర్వహించే ఐ-ప్యాక్ సంస్ధతో సంబంధం ఉన్న ప్రాంగణాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిన సోదాల తర్వాత సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు కీలకంగా మారింది. ఈడీ పిటిషన్ దర్యాప్తుల్లో రాష్ట్ర సంస్థల జోక్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్యను లేవనెత్తుతుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. వాటికి సమాధానం ఇవ్వకపోతే అవి చట్టవిరుద్ధతకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

తీవ్రమైన నేరాన్ని దర్యాప్తు చేయడానికి కేంద్ర సంస్థలు నిజాయితీగా పనిచేస్తుంటే, ఒక ప్రశ్న తలెత్తుతుంది: పార్టీ కార్యకలాపాలు వాటిని అడ్డుకోవచ్చా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. అంతకు ముందు ఈడీ, బెంగాల్ సర్కార్ మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టులో జరిగిన గందరగోళం తమను చాలా కలవరపెట్టిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
-
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?












Click it and Unblock the Notifications