పానీపూరీ ప్రియుల‌కు బిగ్ షాక్‌.. త్వ‌ర‌లో పానీపూరి నిషేదం..!

పానీపూరీ ప్రియుల‌కు షాకింగ్ న్యూస్‌.. త్వ‌ర‌లోనే ప‌లు రాష్ట్రాల్లో పానీపూరి నిషేదించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా పానీపూరి గురించి తెగ వార్త‌లు రావ‌డం మ‌నం చూస్తున్నాం. ఇటీవ‌లీ కాలంలో చిన్నా పెద్ద అనే తేడాలేకుండా పానీ పూరీని ఎంతో ఇష్టంగా తిన‌డం చూస్తున్నాం. సాయంత్రం అవ్వ‌గానే చాలు చాలామంది చాట్ బ‌ళ్ల దగ్గ‌రికి వెళ్లి లొట్ట‌లేసుకుంటూ మ‌రీ పానీపూరీని తినేస్తుంటారు. కానీ, ఆ పానీపూరీలో క్యాన్స‌ర్ కార‌కాలు ఉన్నాయ‌న్న సంగతి ఎవ్వ‌రికైనా తెలుసా..?

అయితే, ఇటీవ‌ల క‌ర్ణాట‌క రాష్ట్రంలో పానీపూరీ తనిఖీలు చేయ‌గా కొన్ని సంచ‌న‌ల విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పానీ కలర్ రావడానికి అందులో కొన్ని ర‌సాయ‌నాల‌ను వాడుతున్న‌ట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఈ త‌నిఖీల్లో భాగంగా సుమారు రాష్ట్రంలోని 276 షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించడం జ‌రిగింది. ఇందులో 41 శాంపిల్స్‌లో కృత్రిమ వర్ణద్రవ్యాలు, క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దీంతో పానీపూరీని నిషేదించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోన్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ఈ రాష్ట్రంతో పాటు మ‌రో రాష్ట్రం కూడా పానీపూరీ నిషేదంపై చ‌ర్య‌లు తీసుకోనుంది.

Big shock for Panipuri lovers Panipuri will be banned soon

కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో చెన్నై వ్యాప్తంగా పానీ పూరీ దుకాణాల్లో పుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వ‌హించారు. అయితే, త‌మిళనాడు రాష్ట్రంలోనూ పానీపూరీలో ఇదే రకమైన కారకాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగానే పానీ పూరీ శాంపుల్స్ ను ల్యాబ్‌కు పంపించారు.

రిపోర్టు ఆధారంగా పానీ పూరీని పద్ధతి ప్రకారం బ్యాన్ చేసి అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అత్యంత ప్రమాణాలతో తయారు చేసిన దుకాణాల్లోనే తినాలని ప్రజలను తమిళనాడు ప్రభుత్వం సూచించింది. అయితే, ఇటీవ‌లే గోబీ మంచూరియా, కబాబ్‌ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్ణ‌యం తీసుకుంది. కృత్రిమ రంగుల వలన పిల్ల‌లో అలర్జీ, హైపర్‌ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంటున్నారు. ఎక్కువ కాలం వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్సర్ బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+