బిగ్ బాస్ పై కర్ణిసేన కన్ను: సహజీవనాన్ని ప్రోత్సహిస్తోంది..నిషేధించాల్సిందేనంటూ..!
ముంబై: కర్ణిసేన.. రాజస్థాన్ కు చెందిన రాజ్ పుత్ వంశస్థులు ఏర్పాటు చేసిన ఓ సంస్థ. దీని పూర్తి పేరు శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన. ఏ విషయం మీదనైనా ఒక్కసారి పట్టు పట్టిందంటే.. ప్రాణాలు పోయేంత వరకూ వదలదు. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసిన పద్మావత్ సినిమా విషయంలోొ కర్ణిసేన పట్టుదల ఏమిటో, ఆ సంస్థ వ్యతిరేకత తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో దేశం మొత్తం చూసింది. అలాంటి కర్ణిసేన కన్ను తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షో మీద పడింది. బిగ్ బాస్ హౌస్ లో చోటు చేసుకునే వ్యవహారాలన్నీ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను చావు దెబ్బ కొట్టేలా ఉన్నాయని, లవ్ జిహాద్ కు దారి తీసేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 13ను నిషేధించాలని డిమాండ్ చేస్తోంది.
హిందీలో బిగ్ బాస్ సీజన్ 13 ప్రస్తుతం ఓ హిందీ ఛానెల్ లో ప్రసారమౌతోంది. బాలీవుడ్ కండల వీరుడిగా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ దీన్ని హోస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో చోటు చేసుకున్న కొన్ని సన్నివేశాలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. దీనితో కర్ణిసేన రంగంలోకి దిగింది. బిగ్ బాస్ 13పై నిషేధం విధించాలని కోరుతూ కర్ణిసేన ప్రధాన కార్యదర్శి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కు లేఖ రాశారు. దీన్ని నిషేధించకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న దేవేంద్ర ఫడణవీస్ కు ఈ వ్యవహారం కొత్త తలనొప్పిని తీసుకుని రావడం ఖాయమని అంటున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు ఒకే గదిలో నివసించడం, ఒకే బెడ్ ను పంచుకోవడం వంటి చర్యలు భారతీయ సంస్కృతికి విరుద్ధమని, ఈ రియాలిటీ షో వల్ల ప్రతి కుటుంబంపైనా అలాంటి చర్యల ప్రభావం పడుతుందని కర్ణిసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించేలా, అనుసరించేలా చేస్తోన్న బిగ్ బాస్ ప్రసారాలపై కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పదని వారు హెచ్చరించారు. లవ్ జిహాద్ వంటి అవాంఛనీయ సంఘటనలకు బిగ్ బాస్ హౌస్ మేట్స్ చర్యలు మరింత ఊతం ఇచ్చేలా ఉన్నాయని కర్ణిసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications