బిగ్ బాస్ విన్నర్ పై కేసు, ఏం చేశాడో తెలుసా, మొన్న రేవ్ పార్టీలు, పాము విషయం, నేడు ?

వివాదాల ద్వారా పేరు తెచ్చుకుని బిగ్ బాస్ లోకి ప్రవేశించి చివరకు బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకున్న 26 ఏళ్ల యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ వివాదాలకు కేంద్ర బిందువు అనే విషయం తెలిసిందే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరెవ్వరికీ తాను తీసిపోనే అనే అహంకారంతో వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. రేవ్ పార్టీలకు వెళ్లడం, పాము విషం వాడిన ఎల్విష్ యాదవ్ సంచలనం సృష్టించి అరెస్ట్ అయ్యాడు.

యూట్యూబర్ ఎల్విస్ యాదవ్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. మొన్నటి బిగ్ బాస్ ఓటీటీ (OTT) సీజన్ 2'లో ఎన్నో వివాదాలు సృష్టించడంతో ఎల్విష్‌ యాదవ్ కి ఎంట్రీ లభించింది. బిగ్ బాస్ గెలిచిన తర్వాత కారణం లేకుండా ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తిని కొట్టిన ఎల్విష్ యాదవ్ చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు.ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అక్రమ నగదు బదిలీ చేశాడని ఎల్విన్ యాదవ్ పై కేసు నమోదు చేశారు.

Bigg Boss winner Elvish Yadav is involved in another controversy

వీటన్నింటి మధ్య ఎల్విష్ యాదవ్ మళ్లీ కష్టాల్లో పడ్డాడు. కాశీ విశ్వనాథ ఆలయ సముదాయంలో ఫోటోలు తీశాడనే ఆరోపణలపై ఎల్విష్ యాదవ్ పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైంది. వారణాసిలోని సెషన్స్ కోర్టు న్యాయవాది ప్రతీక్ కుమార్ సింగ్ బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ మీద ఫిర్యాదు చేశారు.కాశీ విశ్వనాథ్‌ ఆలయంతో సహా అనేక దేవాలయాలలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధించబడింది.

అయితే ఎల్విష్ యాదవ్ ప్రముఖ ఆలయాల సముదాయం లోపల ఫోటోలు తీశాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకు అనుమతిచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి దేవుడిపట్ల ఇలా పక్షపాతం వహించడం ఎంతవరకు సరైందో కూడా చెప్పాలని లాయర్ బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ ను డిమాండ్ చేశారు. ఎల్వీష్ యాదవ్ నుంచి 9 పాములతో పాటు 20 ఎంఎల్ పాము విషాన్ని కొంతకాలం క్రితం స్వాధీనం చేసుకున్నారు.

Bigg Boss winner Elvish Yadav is involved in another controversy

యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ దగ్గర ఐదు నాగుపాములు, ఒక కొండచిలువ, రెండు తలల పాము, ఒక నాగుపాము ఉన్నాయని అధికారులు గుర్తించి అతని మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఎల్విష్ యాదవ్ మరో వివాదం సృష్టించి హాట్ టాపిక్ అయ్యాడు.ఆ తర్వాత ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తిని కొట్టాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

వైరల్ వీడియోలో ఎల్విష్ యాదవ్ రెస్టారెంట్‌కు వెళ్లడాన్ని చూడవచ్చు. అతను నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా వెనక్కి తిరిగి, పక్కన కూర్చున్న వ్యక్తిని చెంపపై బలంగా కొట్టాడు. తర్వాత కొంతదూరం ముందుకు వెళ్లి తిరిగి వచ్చి కొట్టాడు. అదే రెస్టారెంట్ లో ఉన్న ప్రజలు భయాందోళనలతో పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ ఎల్విష్ యాదవ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అప్పుడు పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేసి ఎల్విష్ యాదవ్ మీద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+