పండగపూట విషాదం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం

పాట్నా: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటుండగా.. బీహార్ రాష్ట్రంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. బీహార్‌లోని బెట్టియాలో పండగ సందర్భంగా విషపూరిత మద్యం తాగి.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, కల్తీ మద్యం లేదా మరేదైనా పదార్థాలు తాగడం వల్లే వారంతా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యక్తులంతా మద్యం సేవించారని మృతుల బంధువులు చెప్పారని.. ఘటనా స్థలం నుంచి మద్యం సీసా, హీమోపతిక్ మందు సీసా కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో పంచాయతీ సమితి సభ్యుడు కూడా ఉండటం గమనార్హం.

 Bihar: 10 die in West Champaran and Gopalganj after consuming spurious liquor.

నౌతాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దక్షిణ తెల్హువా గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. దీపావళికి ముందు మద్యం తాగి 24 మంది చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం స్థానికులు మద్యం సేవించారు. మద్యం తాగిన కొద్దిసేపటికే వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. దీంతో వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

పశ్చిమ చంపారన్ జిల్లాలో మరణించిన వారిని బచ్చా యాదవ్, మహరాజ్ యాదవ్, హనుమత్ రాయ్, ముఖేష్ పాశ్వాన్, రామ్ ప్రకాష్ రామ్, జవహీర్ సహానీగా గుర్తించారు. అందరూ నౌటన్ బ్లాక్ నివాసితులు.

Recommended Video

    Hyderabad : ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన Nurse, కుప్పకూలిన యువతి || Oneindia Telugu

    అంతకుముందు గోపాల్‌గంజ్‌లోని మహ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మద్‌పూర్ గ్రామం, బుచెయా, లోహజీరాలో బుధవారం ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముందు నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కంటిచూపు పోయిందని వైద్యులు చెబుతున్నారు. కల్తీ మద్యమే దీనికి కారణమని.. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+