పొర్న్ సైట్ల వల్లే రేప్ లు, ఆ వీడియోలు అంతపని చేస్తున్నాయ్, బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు !
పాట్నా/న్యూఢిల్లీ: పొర్న్ వెబ్ సైట్ల కారణంగానే దేశంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడానికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొర్న్ వెబ్ సైట్లు పూర్తిగా నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. పొర్న్ వెబ్ సైట్లు నిషేదించాలని కేంద్ర ప్రభుత్వానికి తాను లేఖ రాస్తున్నానని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అంటున్నారు.

దిశ ఘటన ఓ ఉదాహరణ
హైదారాబాద్ వెటర్నటీ డాక్టర్ దిశ హత్యాచారం చేసిన కిరాతకుల ఎన్ కౌంటర్ లో అంతం అయిన విషయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దిశ ఘటన జరగడం చాలా దారుణమని, అమ్మాయి కుటుంబ సభ్యుల ఆవేదన చూస్తంటే చాల బాధగా ఉందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. దిశ ఘటనలో పోలీసులు వారి పని వారు చేసుకుని వెళ్లారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా దుర్వినియోగం
సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు కావలనే దుర్వినియోగం చేస్తున్నారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆరోపించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చెయ్యడం వలనే దేశంలో మహిళలు, చిన్నారుల మీద లైంగిక దాడులు ఎక్కువ అవుతున్నాయని, వాటిని అరికట్టాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పారు.

వీడియోలతో అరాచకాలు
దేశంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్న నేరగాళ్లు వాటిని చిత్రీకరించి సోషల్ మీడియోలో ఆ వీడియోలు పోస్టు చేస్తున్నారని, ఆ వీడియోలు చూసి ఇతరులు ఇలాంటి లైంగిక దాడి నేరాలకు పాల్పడుతున్నారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆరోపించారు. ఇలాంటి దారుణాలు అరికట్టాలంటే మరన్ని చట్టాలు అమలు చెయ్యాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పొర్న్ వీడియోలకు చెక్
భారతదేశంలో పొర్న్ వెబ్ సైట్లపై పూర్తిగా నిషేదం విధించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వెబ్ సైట్లలో ఇలాంటి పొర్న్ వీడియోలు పూర్తిగా నిషేధిస్తే నేరాలు అదుపు చెయ్యడానికి అవకాశం ఉంటుందని బీహార్ సీఎం నితీష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో పూర్తిగా పొర్న్ వెబ్ సైట్లు నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి తాను లేఖ రాస్తానని, సంబంధిత మంత్రులు, అధికారులతో తాను ఈ విషయంపై చర్చిస్తానని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మీడియాకు చెప్పారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications