అధికార కూటమికి నూకలు చెల్లాయ్
Nitish Kumar: బిహార్‌లో అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. జనతాదళ్ యునైటెడ్- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. ఈ కూటమి నుంచి బయటికి రావాలని జేడీయూ నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది.
రెండు రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న బిహార్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి జేడీయూ తెరదించింది. కూటమి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. మహా కూటమి నుంచి వైదొలగడంలో భాగంగా జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తారని తెలిపింది.

ఈ నేపథ్యంలో- జేడీయూ శాసన సభా పక్షం ఆదివారం ఉదయం 10 గంటలకు పాట్నాలో సమావేశం కానుంది. అనంతరం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు.
అనంతరం ఎన్డీఏ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ- దాని మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ కూటమిని ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 122. జేడీయూకు 45 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామీ లీగ్-4 స్థానాలను కలుపుకొంటే ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోగలుగుతుంది.
జేడీయూ, బీజేపీ, ఆవామీ లీగ్‌కు చెందిన 127 మంది సభ్యులు.. నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించడం ఖాయంగా కనిపిస్తోంది. తనకు మద్దతు ఇస్తోన్న సభ్యులతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేసిన అనంతరం ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications