Bihar Results: ఆ కూటమి సునామీ- గంటలోనే 100 సీట్ల మార్క్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గెలుపోటముల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కు అతీతంగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా నెలకొంది. ఓటమిని ముందుగానే అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో భారీ విందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు నాయకులు, కార్యకర్తల కోలాహలంతో నిండిపోయాయి.

ప్రారంభ ఫలితాల్లో జనతాదళ్ (యునైటెడ్) భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సునామీలా దూసుకెళ్తోంది. భారీ ఆధిక్యత సాధించింది. తొలి గంటలోనే ఆ కూటమి 100 సీట్ల మార్క్ ను అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్డీఏ సాధించే విజయం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలియజేస్తోంది. ఆయా స్థానాలన్నింట్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజారిటీని సాధించారు. రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తు చేస్తోన్నారు.

Bihar Election Results 2025 NDA touches 100 seats in early trends

అలీనగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిని మైథిలీకుమార్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బిప్లవ్ చౌదరి వెనుకంజలో ఉన్నారు. ప్రారంభ ఫలితాల్లో వెనుకపడ్డ తేజ్ ప్రతాప్ యాదవ్. సంజయ్ కుమార్ సింగ్ ఇక్కడ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మొకామాలో బాహుబలి అనంత్ సింగ్, తారాపూర్ లో సామ్రాట్ చౌదరి, దానాపూర్ లో కేంద్ర మాజీ మంత్రి కృపాల్ యాదవ్, బేతియాలో మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యత సాధించారు.

కతిహార్ లో తారాకిశోర్ ప్రసాద్, సరాయ్ రంజన్ లో మంత్రి విజయ్ చౌదరి, లఖీసరాయ్ లో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా, రఘునాథ్ పూర్ లో ఒసామా సాహబ్ ఆధిక్యతలో ఉన్నారు. అనంత్ సింగ్ పోటీ చేసిన మోకామాలో భారీ విందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీయూ తరపున అనంత సింగ్, ఆర్జేడీ నుంచి వీణా సింగ్ పోటీ పడ్డారు. వీరిద్దరూ కూడా బలమైన అభ్యర్థులే. అనంత సింగ్ తన గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. భారీ మెజారిటీ ఖాయమనే ధీమా జేడీయూలో నెలకొంది. అందుకే ఆయన ఇంట్లో ఇప్పటికే 56 రకాల వంటకాలతో కూడిన మహాభోజ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+