Bihar Elections Exit Polls 2020: ఎన్డీఏకు మెజార్టీ సీట్లు.. దైనిక్ భాస్కర్..ఈటీజీ బీహర్ మాత్రం
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో మహగడ్ బందన్ విజయం సాధిస్తోందని అంచనాలు వస్తోన్నాయి. అన్నీ పోల్స్ ఇదేవిధంగా లెక్కగట్టాయి. ఈటీజీ బీహర్ కూటమి 120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఎన్డీఏ 114 సీట్లతో రెండో స్థానంలో నిలుస్తోందని పేర్కొన్నది. ఎల్జేపీ మాత్రం కేవలం 3 సీట్లతో సరిపెట్టుకుంటుందని అంచనా వేసింది. ఇతరులు 6 సీట్లు గెలుచుకుంటారని తెలిపింది. దీంతో ఇతరులు/ ఎల్జేపీ సభ్యులు.. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నారు.
అయితే దైనిక్ భాస్కర్ అంచనాలు మాత్రం కాస్త విరుద్దంగా వచ్చాయి. ఎన్డీఏ కూటమి 120-127 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నాయి. మహగడ్ బందన్ మాత్రం 71 నుంచి 81 సీట్లు గెలుస్లోందని తెలిపింది. ఎల్జేపీ సీటు షేరింగ్ పెరిగింది. 12 నుంచి 23 సీట్లలో విజయం సాధించనుందని పేర్కొన్నది. ఇతరులు 19 నుంచి 27 చోట్ల ప్రభావం చూపుతారని లెక్కవేసింది. దైనిక్ భాస్కర్ అంచనాల ప్రకారం ఎన్డీఏ స్పష్టమైన మెజార్టీ సాధించబోతోంది.

బీహర్ అసెంబ్లీలో 243 నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. అక్టోబర్ 28వ తేదీన తొలి విడత.. ఈ నెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరిగాయి. శనివారం ఇవాళ మూడో విడత 78 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 122 సీట్లు తప్పనిసరి.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications