బైక్ ఓవర్‌టేక్ గొడవ.. రోడ్డుపైనే ఎలా కొట్టి చెంపేశారో చూడండి(వీడియో)
ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. బైక్ ఓవర్‌టేక్ విషయమై జరిగిన గొడవలో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపేశారు. గర్భిణిగా ఉన్న మృతుని భార్య అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమెపై కూడా దాడి చేశారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయ్యింది. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అయ్యాయి.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) సభ్యుడుగా ఉన్న ఆకాష్ మైన్ అనే వ్యక్తి ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకాష్ మలాద్ ఈస్ట్‌లోని ఆటో డ్రైవర్లతో ఓవర్‌టేక్ విషయమై గొడవ పడ్డాడు. దీంతో వారంతా గోరేగావ్‌లో ఆకాష్‌ను గుర్తించి విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన ఆకాష్ భార్యని కూడా కొట్టారు. గర్భవతిగా ఉన్న ఆమెకు వీరి దాడిలో గర్భస్రావం అయ్యింది. ఆ సమయంలో ఆకాష్ తండ్రి కూడా అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. దాడిలో అతడి కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన విషయంలో ఇప్పటికే ముంబైలోని దిండోషి పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. 9 మంది నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులకు అక్టోబర్ 22 వరకు పోలీసు కస్టడీ పంపించింది.

విచక్షణా రహితంగా తన్నడంతో..
తాజాగా దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యుల ముందే ఆకాష్‌ను 12 నుంచి 15 మంది గుంపుగా దాడి చేస్తున్న దృష్యాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. భర్తను కాపాడుకునేందుకు అతని భార్య చేస్తున్న ప్రయత్నం ఫలించలేదు. భర్తపై దాడి జరగకుండా అతనిపై ఆమె పడుకుని ఉన్నప్పటికీ గుంపులోని వ్యక్తులు కాళ్లతో తంతూ.. రాక్షసానందాన్ని పొందినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటన అక్టోబర్ 12 జరిగింది. ఈ ఘటనపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. యువకుడిపై పిడిగుద్దులు కురిపించడంతోపాటు విచక్షణారహితంగా తన్నడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దగ్గరలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆరుగురిని ఆదివారం మరో ముగ్గిరిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
𝐌𝐨𝐛 𝐨𝐟 𝟏𝟎-𝟏𝟓 𝐫𝐨𝐰𝐝𝐲 𝐲𝐨𝐮𝐭𝐡 𝐥𝐲𝐧𝐜𝐡𝐞𝐝 𝐨𝐧𝐞 𝐛𝐢𝐤𝐞𝐫, 𝐰𝐡𝐢𝐥𝐞 𝐡𝐢𝐬 𝐰𝐢𝐟𝐞 𝐡𝐚𝐝 𝐦𝐢𝐬𝐜𝐚𝐫𝐫𝐢𝐚𝐠𝐞 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐜𝐞 𝐢𝐧 𝐌𝐚𝐥𝐚𝐝 |
— MUMBAI NEWS (@Mumbaikhabar9) October 15, 2024
In a road rage in Mumbai on 12th the group killed Akash Maine. His 3 months pregnant wife got… pic.twitter.com/vLzaeDHT72
-
తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! వీడియో -
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications