డాలీ చాయ్‌వాలాతో బిల్ గేట్స్ చాయ్ పే చర్చ: లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్!!
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఇటీవల భారతదేశంలో పర్యటించారు. హైదరాబాద్ కు వచ్చిన బిల్ గేట్స్ హైదరాబాద్లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించారు. ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు జరిగి 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ కేంద్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్ కొందరు మేధో వంతులైన ఇంజనీరింగ్ సిబ్బందితో భేటీ అయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారత్ కు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇక దేశంలో అనేక ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఇదే సమయంలో భారత పర్యటనకు సంబంధించి ఆయన ఒక ఆసక్తికర వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో నాగపూర్ కు చెందిన డాలీ అనే లోకల్ గా టీ తయారు చేసిన ఒక వ్యక్తి నుండి టీ తాగుతూ దానిని ఆస్వాదిస్తూ లోకల్ కల్చర్ ను ఆయన అనుభూతి చెందారు. ఈ వీడియోలో డాలీ చాయ్ వాలా నిర్వహిస్తున్న చాయ్ బండి దగ్గర బిల్ గేట్స్ సందడి చేశారు.

ఆసక్తికరమైన బిల్ గేట్స్ వీడియోలో భారత్ లో దైనందిన జీవితంలో వినూత్నత ఉట్టి పడుతుందని, ప్రతి ఒక్కరిలోనూ కొత్తదనం కనిపిస్తుందని ఆయన instagram పోస్టులో పేర్కొన్నారు. వన్ చాయ్ ప్లీజ్ అని ఆయన టీ కోరుతున్న ఒక వీడియో క్లిప్ లో బిల్ గేట్స్ ఒక బండిపైన టీ విక్రయించే వ్యక్తి తనకున్న వినూత్న శైలితో టీ ని తయారు చేస్తున్న పద్ధతిని చూపించారు.
అతని టీ తయారీ స్టైల్ తనను ఎంతో ఆకట్టుకుందని ఆ మొత్తం వీడియోను బిల్ గేట్స్ షేర్ చేశారు. అంతేకాదు భారత్ కు తిరిగి రావడం పట్ల ఉద్వేగంగా ఉందని వేడి వేడి టీ ని ఆస్వాదిస్తూ బిల్ గేట్స్ చెబుతుండడం ఈ వీడియోలో ప్రధానంగా కనిపిస్తుంది. టీని తయారు చేసే మామూలు పనిని కూడా చాలా కళాత్మకంగా తయారు చేయడం భారతీయుల గొప్పతనం అని బిల్ గేట్స్ ప్రశంసించారు.
ఇక్కడ తమ జీవనశైలిని మెరుగుపరుచుకునేందుకు ఎంతోమంది అద్భుతమైన ఇన్నోవేటర్స్ ఉన్నారని బిల్ గేట్స్ వారిని కొనియాడారు. ఓ కప్పు టీ కూడా ఆర్టేనని పేర్కొని, టీ అమ్ముకునే వ్యక్తి పక్కన నిలబడి మరిన్ని ఛాయ్ పే చర్చల కోసం వేచి చూస్తున్నానని బిల్ గేట్స్ చెప్పడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇక బిల్ గేట్స్ షేర్ చేసిన ఈ వైరల్ వీడియో చూసిన వారంతా చాయ్ వాలాను లక్కీ ఫెలో అంటూ కొనియాడుతున్నారు.












Click it and Unblock the Notifications