కోవిడ్ వ్యాక్సిన్ ఫార్ములా భారత్ కు ఇవ్వొద్దని బిల్ గేట్స్ వివాదాస్పద వ్యాఖ్యలు, వెల్లువగా విమర్శలు
కరోనావైరస్ మహమ్మారి యొక్క రెండవ దశను భారత్ చూస్తోంది. కోవిడ్-19 కారణంగా దేశం తీవ్రంగా ప్రభావితమైంది. ఇదే సమయంలో ప్రపంచ దేశాలు భారతదేశానికి మద్దతును అందించడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే కరోనా సంక్షోభ సమయంలో టెక్ దిగ్గజం బిల్ గేట్స్ వ్యాక్సిన సాంకేతిక పరిజ్ఞానం యొక్క పేటెంట్లకు సంబంధించి వివాదాస్పద ప్రకటన చేశారు .దీంతో ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు.

భారత్ కు వ్యతిరేకంగా బిల్ గేట్స్ వివాదాస్పద వ్యాఖ్యలు
మానవత్వం ఉన్న వ్యక్తిగా, గొప్ప దాతగా పేరుపొందారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ . గతంలో అనేకమార్లు భారత్ పై ప్రశంసల వర్షం కురిపించిన బిల్ గేట్స్ ఇప్పుడు భారత్ కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కొవిడ్-19 కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందజేయకూడదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనావైరస్ ను అరికట్టడంలో మరియు దాని కోసం వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో ప్రపంచం మొత్తం పాల్గొంటున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

మేధోసంపత్తి హక్కుల చట్టంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిల్ గేట్స్ .. వ్యాక్సిన్ ఫార్ములా ఇవ్వొద్దని
కోవిడ్ వ్యాక్సిన్ ఫార్ములాలు ఇతర దేశాలతో పెంచుకోవడానికి వీలుగా మేధోసంపత్తి హక్కుల చట్టాన్ని మార్చడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించినపుడు, దానికి సమాధానంగా బిల్ గేట్స్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఫార్ములాని ఇవ్వడాన్ని స్పష్టంగా నిరాకరించారు. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీ ఫార్ములా విషయంలో మరింత వివరణ ఇచ్చిన ఆయన, ప్రపంచంలో చాలా వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఉన్నాయని, వ్యాక్సిన్ ల భద్రత గురించి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలోవ్యాక్సిన్ తయారీ ఫార్ములాను పంచుకోవడం మేధోసంపత్తి హక్కుల చట్టాన్ని ప్రశ్నార్థకం చేయడమేనని పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్ ఫార్ములా ఎవరితోనైనా పంచుకోగల పేటెంట్ కాదన్న బిల్ గేట్స్
అంతేకాదు అమెరికాలోని జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీకి భారతదేశంలోని వ్యాక్సిన్లు తయారీ కర్మాగారానికి చాలా తేడా ఉంది. మా నైపుణ్యం,డబ్బు, విజయవంతమైన వ్యాక్సిన్లను తయారుచేస్తాయి. కరోనా వ్యాక్సిన్ ఫార్ములా ఎవరితోనైనా పంచుకోగల పేటెంట్ లాంటిది కాదని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.దేశంలోని అతిపెద్ద సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII), ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం ప్రకారం కోవిడ్ 19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను తయారు చేస్తోంది.

భారత్ తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలతో వ్యాక్సిన్ ఫార్ములాను పంచుకోవద్దన్న వ్యాఖ్యలతో విమర్శలు
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిపై ప్రపంచవ్యాప్తంగా మేధోసంపత్తి హక్కులపై చర్చ జరుగుతోంది. ఇక ఇదే సమయంలో భారత్ తో సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో వ్యాక్సిన్ ఫార్ములాను పంచుకోవద్దని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఆవిష్కరణలను బిలియన్ డాలర్ల సంపదగా మార్చిన మేధో సంపత్తి చట్టాల ద్వారా ఎక్కువగా సంపాదించాడు. అందుకే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారని పలువురు అంటున్నారు.












Click it and Unblock the Notifications