థాంక్యూ ఇండియా, పీఎం నరేంద్ర మోడీ: టోరంటో రహదారులపై భారీ బిల్‌బోర్డ్స్

టోరంటో/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు కరోనా మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సిన్లను అందిస్తున్న భారతదేశం పట్ల ఆయా దేశాలు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. తాజాగా, మనదేశం నుంచి కరోనా వ్యాక్సిన్ అందుకున్న కెనడా ధన్యవాదాలు తెలిపింది.

థాంక్యూ ఇండియా అండ్ ప్రధాని నరేంద్ర మోడీ.. అంటూ గ్రేటర్ టొరంటో రహదారుల వెంట ఏర్పాటు చేసిన భారీ బిల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ డోసులు పంపించి అండగా నిలిచిన విశ్వగురు భారత్‌కు కెనడా ఈ విధంగా కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 billboards in Toronto thank PM Narendra Modi for providing COVID-19 vaccines to Canada

కాగా, సుమారు 150 దేశాలకు కరోనా వ్యాక్సిన్లను అందించి భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అగ్రరాజ్యాలు సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థలు భారత్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నాయి. బిల్ గేట్స్ కూడా ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న మనదేశంపై పలుమార్లు ప్రశంసలు కురిపించారు.

తాజాగా, కెనడాకు 5 లక్షల డోసుల కోవిషీల్డ్ టీకాలను భారత్ పంపించింది. భారత్ చూపిన ఔదార్యానికి గానూ కెనడాలోని టోరంటో రహదారులపై థాంక్యూ ఇండియా, పీఎం నరేంద్ర మోడీ అంటూ భారీ బిల్ బోర్డులను ఏర్పాటు చేసింది. వ్యాక్సిన్లను అందించి ఆదుకున్న భారత్, కెనడాల మధ్య స్నేహం ఇలాగే కొనసాగాలని కెనడా వాసులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, భారత్ ఇప్పటికే 150 దేశాలకుపై కరోనా వ్యాక్సిన్లను, ఇతర ఔషధాలను అందించిందని ఇటీవల ప్రధాని మోడీ వెల్లడించారు. మరోవైపు మనదేశంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కూడా వేగంగా సాగుతోంది. దేశంలో బుధవారం సాయంత్రం వరకు 2.52 కోట్ల మందికి డోసులు తీసుకున్నారు. వీరిలో 71,70,519 ఆరోగ్య సంరక్షణ, 70,31,147 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులకు మొదటి డోసు ఇవ్వగా, 39,77,407 ఆరోగ్య సంరక్షణ, 5,82,118 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులకు రెండవ మోతాదు ఇచ్చారు. కాగా, ఇప్పటి వరకు 481 లక్షల డోసులను పలు దేశాలకు సరఫరా చేసినట్లు ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+