మైనర్ బాలుడితో సల్మాన్‌ఖాన్ హత్యకు బిస్టోయ్ గ్యాంగ్ కుట్ర.. సంచలన ఛార్జ్‌షీట్!!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ భారీ ప్లాన్ చేసినట్టు గతంలోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ కూడా అయ్యింది. గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు సల్మాన్ ఖాన్ కదలికల పైన నిఘా పెట్టినట్టు అందులో భాగంగానే ఆయనపై కుట్ర చేసినట్టు చర్చ జరిగింది.
సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నం కేసులో.. షాకింగ్ ఛార్జ్ షీట్
అయితే తాజాగా సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర చేసిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీ ముంబై పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ప్రకారం ఈ ఇదుగురికి బిస్టోయ్ గ్యాంగ్ తో సంబంధాలున్నాయి. వీరు సల్మాన్ ఖాన్ ను చంపేందుకు 25 లక్షల రూపాయల సుపారీకి ఒప్పుకున్నారు.

ఏకే 47, జిగానాతో సహా పాక్ నుండి అత్యాధునిక ఆయుధాలు
సల్మాన్ ఖాన్ కదలికల పైన ఫోకస్ పెట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ ఆయన కారును చుట్టుముట్టి కాల్పులు జరపాలని, ఆయనను అంతమొందించాలని ప్లాన్ చేసింది. దీనికోసం పాకిస్తాన్ నుంచి ఏకంగా ఏకే 47, ఏకే 92, ఎమ్ 16 రైఫిల్స్, టర్కిష్ తయారు చేసిన జిగానా పిస్టల్ తో సహా పాకిస్తాన్ నుండి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేసినట్టు ఛార్జ్ షీట్ లోపేర్కొన్నారు.
సల్మాన్ ను చంపేందుకు పక్కా ప్లాన్
ఇక సల్మాన్ ఖాన్ ను చంపటం కోసం ఉత్తర అమెరికా నుండి ఒక బాలుడిని తీసుకువచ్చినట్టు, అతను ప్లానింగ్ అంతా పూర్తి చేసి బిస్టోయ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. సల్మాన్ ఖాన్ కదలికలను గుర్తించడానికి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఏకంగా అరవై నుండి డెబ్బై మందిని రంగంలోకి దించారని పేర్కొన్నారు.
సల్మాన్ కదలికలపై నిఘా..
ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటివద్ద, పన్వేల్ లోని ఆయన ఫామ్ హౌస్ వద్ద, షూటింగ్ సెట్స్ వద్ద కూడా హీరో కదలికలను ఎప్పటికప్పుడు గమనించారని పేర్కొన్నారు. రాజస్థాన్లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఆయనను చంపేందుకు పాకిస్తాన్ కి చెందిన ఒక ఆయుధాల సప్లయర్ నుంచి ఏకే 47, ఎం 16, ఏకే 92, హై కాలిబర్ తెప్పించినట్టు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications