మనిషి తలతో జన్మించిన మేక.. చూసేందుకు ఎగబడ్డ జనం.. కాలజ్ఞానంలో చెప్పింది ఇదేనా..?

తమిళనాడులో వింత సంఘటన జరిగింది. కల్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌ పేట సమీపంలోని సేందమంగళం గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది. ఆ ఊరిలో మనిషిని పోలిన మేక జన్మించింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. మేక మొత్తం మానవ పోలికలతో ఉండడంతో ఆశ్యర్చపోతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెటిజెన్లు షేర్ చేస్తున్నారు.

ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ సీతారాంపురం SC కాలనిలో అద్భుతం జరిగిన విషయం తెలిసిందే. ఓ చింత మొక్క తనంతట తాను తిరుగుతూ కనిపించింది. ప్రజలంతా ఇదో వింతగా భావించారు. అయితే తమిళనాడులో అంతకుమించిన వింత ఘటన జరిగింది. మేకకు మనిషిని పోలిన పిల్ల పుట్టింది. ఈ ఘటన తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపం సేందమంగళం గ్రామంలో జరిగింది.

Bizarre Birth in Ulundurpet Goat Resembling Human Born in Kallakurichi District

ఆ గ్రామానికి చెందిన ఆనందన్‌(38) రైతుకు 20కు పైగా మేకలు ఉన్నాయి. అందులో ఓ మేక ఇటీవల రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వాటిల్లో ఒకటి మానవ పోలికలతో చనిపోయి పుట్టింది. ఈ విషయం గ్రామస్థులకు చుట్టుపక్కల ప్రజలకు తెలియడంతో తండోపతండాలుగా వచ్చి వింత ఆకారంతో పుట్టిన మేక పిల్లను చూసి వెళ్లారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో కాలజ్ఞానం నిజం అవుతోంది అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+