రసవత్తరం హరిద్వార్ పోరు: బిజెపి ప్రచారకర్త జాబితాలో అద్వానీ మిస్
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హరిద్వార్ జిల్లా కీలకంగా మారింది. బిజెపి టిక్కెట్లు ఖరారు చేసిన తర్వాత తలెత్తిన అసమ్మతి కీలక స్థానాల్లో పార్టీల గెలుపొటములను నిర్ణయించనున్నది.
హరిద్వార్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హరిద్వార్ జిల్లా కీలకంగా మారింది. బిజెపి టిక్కెట్లు ఖరారు చేసిన తర్వాత తలెత్తిన అసమ్మతి కీలక స్థానాల్లో పార్టీల గెలుపొటములను నిర్ణయించనున్నది.
ప్రత్యేకించి రూర్కీ, పిరాన్ కలియార్, హరిద్వార్ రూరల్, లస్కర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను పోటీలో నిలబెడతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే హరిద్వార్ జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి మధ్య ముఖాముఖీ పోటీలు ఖాయంగా కనిపిస్తోంది.

హరీష్ రావత్
హరిద్వార్ రూరల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిఎం హరీశ్‌రావత్ బరిలో దిగడం ఖాయమని తెలుస్తున్నది. ఈ స్థానం నుంచి బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామి యతీశ్వరానంద్‌తో పోటాపోటీగా ఎన్నికలు జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా హరిద్వార్ రూరల్ నియోజకవర్గ స్థానంలో హరీశ్ రావత్ తనయ అనుపమ రావత్ పనిచేస్తున్నారు.

బీజేపీ
కొన్నేళ్ల క్రితం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంబరీశ్ కుమార్.. బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే అదేశ్ చౌహాన్ పై పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. బిజెపి టిక్కెట్ నిరాకరణతో ఆ పార్టీ సీనియర్ నేత సురేశ్ చంద్ జైన్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన ప్రదీప్ బత్రాకు బిజెపి టిక్కెట్ ఇచ్చింది. ఇదే నియోజకవర్గం నుంచి బత్రా గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
ముఖాముఖీ పోటీ జరిగే మరో స్థానం జ్వాలాపూర్ రిజర్వుడ్. ఈ నియోజకవర్గం నుంచి బిజెపి హరిద్వార్ శాఖ అధ్యక్షుడు సురేశ్ రాథోడ్ బరిలో నిలుస్తుండగా, 2012 ఎన్నికల్లో గెలుపొందిన సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే చంద్రశేఖర్ భట్టేవాలాకు టిక్కెట్ నిరాకరించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి పాలైన హరిద్వార్ జిల్లా బోర్డు చైర్ పర్సన్ బ్రిజ్ రాణి బరిలో నిలువనున్నారు. హరిద్వార్ సిటీ నుంచి మూడుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ కౌశిక్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బ్రహ్మస్వరూప్ బ్రహ్మచారి పోటీ చేయనున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడైన బ్రహ్మచారి నిత్యం రాజ్యసభ సభ్యత్వం కోసం తహతహలాడారు.
జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులను నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఐదు స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని బిజెపి తహతహలాడుతున్నది.

అద్వానీ, వరుణ్ తదితరులకు నో చాన్స్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ప్రచారకర్తల జాబితాలో బిజెపి సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, నెహ్రూ - గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీ, రాం జన్మభూమి ఉద్యమ నాయకుడిగా వినయ్ కతియార్ వంటి ప్రముఖుల పేర్లు కాన రాలేదు. వరుణ్ గాంధీ తనయుడు,కేంద్ర మంత్రి మేనకాగాంధీ పేరు మాత్రం జాబితాలో ఉన్నది. వరుణ్ గాంధీ మద్దతుదారులు ఆయనను యుపి సీఎం అభ్యర్థిగా భావించారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి సమర్పించిన జాబితాలో పార్టీలో కీలక పాత్ర పోషించిన నేతల పేర్లేవీ లేవు. పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి, యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పేరు జాడలేదు.

మోదీ, అమిత్ షాలతోపాటు మరో 40 మంది
ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరుల పేర్లతోపాటు ఇటీవలే బిఎస్‌పి నుంచి పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య పేరు కూడా చేర్చారు. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, ఎం వెంకయ్యనాయుడు, రాం విలాస్ పాశ్వాన్, సంజీవ్ బాల్యన్, ఉమా భారతి, స్మ్రుతి ఇరానీ తదితరుల పేర్లు కూడా చేరాయి. గత ఏడాది కేంద్ర క్యాబినెట్ లో చేరే అవకాశం త్రుటిలో తప్పిపోయిన యోగి ఆదిత్యానాథ్, రాంశంకర్ ఖతేరియా పేర్లు చేర్చారు. రవికాంత్ గార్గ్, బిఎల్ వర్మ, లోకేశ్ ప్రజాపతి వంటి మామూలు నేతల పేర్లు కూడా ఎన్నికల ప్రచారకర్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతోపాటు ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ సిఎం వసుంధరా రాజె సింధియా కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తమ భుజస్కందాలపై మోయనున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications