కమ్యూనిస్టుల బాటలో బీజేపీ-గుజరాత్ కేబినెట్ లో అన్నీ కొత్త ముఖాలే-సీఎం సహా
మన దేశంలో కమ్యూనిస్టుల పేరు చెబితే అంతెత్తున్న లేచే బీజేపీ ఇప్పుడు గుజరాత్ లో కమ్యూనిస్టుల కేరళ ఫార్ములాను అనుసరించింది. తాజాగా కేరళలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులు సీఎం పినరయి విజయన్ మినహా మిగతా మంత్రుందరికీ మొండిచేయి చూపించగా.. ఇప్పుడు గుజరాత్ లో ఎన్నికలకు ముందే బీజేపీ ఆ పని చేసింది. కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్ ఇవాళ తన కేబినెట్ ను 25 మంది మంత్రులతో విస్తరించారు.
గుజరాత్ లో భూపేంద్ర పటేల్ కేబినెట్ విస్తరణ కార్యక్రమం ఇవాళ జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం భూపేంద్ర పాత విజయ్ రూపాణీ కేబినెట్లో పనిచేసిన మంత్రుల్లో ఒక్కరికి కూడా తన మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు. మొత్తం 24 మంది మంత్రులనూ కొత్త వారినే తీసుకున్నారు. గుజరాత్ లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఎన్నికలకు ముందు కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని భావించిన అధిష్టానం.. సీఎంగా విజయ్ రూపాణీ స్ధానంలో భూపేంద్ర పటేల్ ను తీసుకొచ్చింది. అంతే కాకుండా ఆయన కేబినెట్లో సైతం పాత వారెవరికీ చోటు కల్పించలేదు.

ఇవాళ మొత్తం 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. వీరిలో 10 మంది మాత్రమే కేబినెట్ మంత్రులు. మిగతా 14 మంది సహాయ మంత్రులే. సీఎం భూపేంద్రతో కలుపుకుంటే కేబినెట్లో 25 మంది మంత్రులున్నట్లు లెక్క. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఇవాళ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

కొత్త కేబినెట్లో అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదీతో పాటు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు జితూ వాఘానీకి కూడా చోటు దక్కింది. రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు వేసిన సూరత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీకి కూడా కేబినెట్ లో చోటు కల్పించారు. ప్రస్తుత కేబినెట్ మంత్రుల్లోనూ కేవలం రాజేంద్ర త్రివేదీ, కీర్తిసిన్హ్ రాణా, రాఘవ్ జీ పటేల్ కు మాత్రమే గతంలో కేబినెట్ మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. వీరే కాదు తాజాగా కేబినెట్లో చోటు దక్కించుకున్న చాలా మంది తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారు కూడా ఉన్నారు. ఎన్నికలకు కేవలం 15 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో బీజేపీ వేసిన ఈ పాచిక పారుతుందో లేదో చూడాల్సి ఉంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications