బాలికపై లైంగిక వేధింపులు: బిజెపి నేత అరెస్టు

గాంధీనగర్: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణపై బిజెపి నేత ఒకరు అరెస్టయ్యారు. తల్లిదండ్రులతో కలిసి వచ్చి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో బిజెపి నేత అశోక్ మక్వానాను గాంధీనగర్‌లోని సర్దార్ నగర్ పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు.

ఎయిర్‌లైన్స్ నుంచి పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను సేకరించారు. మూడు రోజుల క్రితం బాలిక పట్ల విమానంలో మక్వానా అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. వేసవి సెలవులు కావడంతో 13 ఏళ్ల బాలిక గోవాలోని తన అంకుల్ ఇంటికి వెళ్లింది.

BJP leader arrested for 'molesting' minor girl on board IndiGo flight

మే 28వ తేదీన ఇండిగో విమానంలో ఇంటికి తిరుగు ముఖం పట్టింది. మక్వానా ఆ బాలిక పక్క సీట్లో కూర్చుని ప్రయాణించారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. ఇంటికి చేరుకున్న బాలిక విమాన ప్రయాణంలో తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రవర్తించిన తీరును తల్లిదండ్రులకు చెప్పింది.

ఆ ప్రముఖ వ్యాపార సంస్థ యజమాని అయిన బాలిక తండ్రి తమకు ఫిర్యాదు చేశారని కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి బీడీ పాటిల్ చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అశోక్ మక్వానాను అరెస్టు చేశామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+