ఆ ఎన్నికల్లో భారతీయులు జోక్యం చేసుకునేలా చేయొద్దు: శాండర్స్‌కు బీజేపీ నేత కౌంటర్

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై డొనాల్డ్ ట్రంప్ తనకేమీ పట్టనట్లు సమాధానం చెప్పడం చూస్తే ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవనేది స్పష్టంగా కనపిస్తోందని అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న సెనేటర్ బెర్నీ శాండర్స్ చెప్పారు. అయితే బెర్నీ శాండర్స్ వ్యాఖ్యలకు బీజేపీ నేత కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు చేయాలని ఉబలాటపడుతున్న శాండర్స్‌ ఒక విషయం గుర్తుంచుకోవాలని ట్వీట్ చేశారు.

ఢిల్లీ అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న సెనేటర్ బెర్నీ శాండర్స్. మంగళవారం రోజున మీడియాతో మాట్లాడిన ట్రంప్‌కు ఓ జర్నలిస్టు ఢిల్లీ అల్లర్ల గురించి ప్రస్తావించారు. ఆ విషయం తన దృష్టికి వచ్చిందా అని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు వచ్చిందని సమాధానం చెబుతూనే అది భారత ప్రభుత్వం చూసుకుంటుందంటూ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంను తప్పుబట్టారు శాండర్స్. ట్రంప్‌లో నాయకత్వ లక్షణాలు లేవని అన్నారు. ఇందుకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత బీఎల్ సంతోష్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తారన్న విషయాన్ని శాండర్స్ గుర్తుంచుకోవాలంటూ ట్వీట్ చేశారు బీజేపీ నేత సంతోష్.

BJP leader Santosh counters Sanders, says Indians will interfere in US polls

డెమొక్రటిక్ పార్టీనుంచి అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న శాండర్స్ ట్వీట్ చేశారు. 200 మిలియన్ మంది ముస్లింలకు భారత్ నివాసంగా ఉంటోందని అన్నారు. ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నవారు 27 మందిని చంపేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు. పలువురిని గాయపర్చారని వెల్లడించారు. దీని గురించి ట్రంప్‌ను ప్రశ్నిస్తే అది భారత్‌కు సంబంధించిన విషయమంటూ తేలిగ్గా తీసి పారేశారని విమర్శించారు శాండర్స్.

ఇదిలా ఉంటే ఢిల్లీ అల్లర్లలో మృతు సంఖ్య 34 కు చేరుకుంది. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే అల్లర్లు మరింత ఉద్రిక్తంగా మారడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ అల్లర్లపై రిపోర్టర్లు ప్రశ్నించిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+