BJP led NDA meeting Live:టార్గెట్ 2024, విపక్షాలకు ఎన్డీయే కౌంటర్, మోడీ కీలక ప్రసంగం

ఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) సమావేశానికి అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తు పెట్టుకున్న 38 పార్టీలు హాజరయ్యాయి. ఏపీ నుంచి జనసేన పార్టీకి ఆహ్వానం అందగా టీడీపీకి ఆహ్వానం అందలేదు. భారత్‌ను బలోపేతం చేసే దిశగా ఎన్డీయే పనిచేస్తోంటే, యూపీఏ అందుకు భిన్నంగా పనిచేస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. నాయకత్వం లేనిది, ఒక విధానమంటూ లేకుండా ముందుకు సాగుతోందంటూ ఘాటు విమర్శలు చేశారు.

 BJP led NDA meeting

మరోవైపు బెంగళూరు వేదికగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల భేటీ జరగనుంది. ఇప్పటికే బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలకు సంబంధించిన నాయకులు బెంగళూరుకు చేరుకున్నారు. దక్షిణాదిన విపక్షాల భేటీ, ఉత్తరాదిన ఎన్డీయే మిత్రపక్షాల భేటీతో మంగళవారం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల గెలుపే లక్ష్యంగా రెండు కూటములు పావులు కదుపుతున్నాయి. ఇక ఎన్డీయే మిత్రపక్షాల భేటీకి సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Jul 18, 2023, 10:35 pm IST

2024లో ఎన్డీయే కూటమి 50 శాతం ఓట్ల వాటాను సాధిస్తుంది: ప్రధాని మోడీ
Jul 18, 2023, 10:35 pm IST

తన శరీరంలోని ప్రతి కణం, తన సమయంలోని ప్రతి క్షణం దేశం కోసమే వినియోగిస్తున్నానని, వినియోగిస్తానని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
Jul 18, 2023, 9:25 pm IST

తాము ప్రతిక్షంలో ఉన్న సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశాల మద్దతును ఎప్పుడూ తీసుకోలేదని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు. సానుకూల రాజకీయాల చేశామన్నారు.
Jul 18, 2023, 9:24 pm IST

తాము ఎల్లప్పుడూ భారతదేశాన్ని అన్ని రాజకీయ ప్రయోజనాల కంటే ఎక్కువగా దేశ ప్రయోజనాలకే ఇస్తాం: NDA నేతల సమావేశంలో ప్రధాని మోడీ.
Jul 18, 2023, 9:22 pm IST

శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, గులాం నబీ ఆజాద్, ముజఫర్ బేగ్, బిజెపి-ఎన్‌డిఎతో లేని అనేక ఇతర నాయకులకు కూడా NDA పద్మ అవార్డును ప్రదానం చేసింది. ప్రణబ్ ముఖర్జీకి భారత అందించింది కూడా ఎన్డీఏనే అని ప్రధాని చెప్పారు.
Jul 18, 2023, 9:21 pm IST

రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉండాలి కానీ, శత్రుత్వం ఉండకూడదన్నారు ప్రధాని మోడీ. కానీ, విపక్షాలు అనుచిత భాషను ఉపయోగించి విమర్శలు చేస్తున్నాయని అన్నారు.
Jul 18, 2023, 9:06 pm IST

ఎన్డీఏలో పెద్ద పార్టీ, చిన్న పార్టీ లేవని.. అంతా సమానమేనని అన్నారు ప్రధాని మోడీ.
Jul 18, 2023, 8:57 pm IST

ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగం వీడియో.
Jul 18, 2023, 8:53 pm IST

NDAకి దేశమే మొదటి ప్రాధాన్యత అని, దేశ భద్రత, పురోగతి, ప్రజల సాధికారత తమకు ముఖ్యమని ప్రధాని అన్నారు.
Jul 18, 2023, 8:51 pm IST

తాము ఎప్పుడూ పాజిటివ్ పొలిటిక్స్ చేశామన్నారు ప్రధాని మోడీ. విపక్షాల అవినీతిని ఎత్తి చూపామని, తాము ఎప్పుడూ ప్రజా తీర్పును తప్పుబట్టలేదన్నారు.
Jul 18, 2023, 8:48 pm IST

ఎన్డీఏతో కలిసి వచ్చిన పార్టీలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.
Jul 18, 2023, 8:48 pm IST

ఎన్డీఏ సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్డీఏ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పరు. ఎన్డీఏ అంటే న్యూ ఇండియా, అభివృద్ధి, ఆకాంక్ష అని వివరించారు.
Jul 18, 2023, 8:39 pm IST

ప్రధాని మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న చిరాగ్ పాశ్వాన్.
Jul 18, 2023, 8:18 pm IST

ఢిల్లీలో కొనసాగుతన్న ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం.
Jul 18, 2023, 7:34 pm IST

ఒకప్పుడు ఎన్డీఏ మిత్రులను వదిలేసిన బీజేపీ.. ఇప్పుడు మళ్లీ పిలుస్తోందని ఇది తప్పు అని కర్ణాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.
Jul 18, 2023, 6:43 pm IST

బీజేపీకి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అసవరం ఏర్పడిందని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Jul 18, 2023, 6:42 pm IST

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి ఐక్యంగా పోరాడుతుందని ఎంపీ కపిల్ సిబల్ చెప్పారు.
Jul 18, 2023, 6:40 pm IST

మణిపూర్‌లో అల్లర్లు కొనసాగుతున్నా.. ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని విపక్షాల నేతలు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆరోపించారు.
Jul 18, 2023, 5:56 pm IST

"మాది కాలపరీక్షల కూటమి, ఇది మరింత దేశ పురోగతిని కోరుకునేది" అని NDA సమావేశానికి ముందు ప్రధాని మోడీ చెప్పారు
Jul 18, 2023, 5:15 pm IST

ఎన్డీయే సమావేశానికి కేంద్ర మంత్రి, అప్నా దళ్ (సోనేలాల్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్ వచ్చారు.
Jul 18, 2023, 4:20 pm IST

బెంగళూరులో జరిగిన భారీ సమావేశం అనంతరం విపక్ష నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Jul 18, 2023, 2:46 pm IST

"ప్రతిదానికీ రెండు వైపులా ఉన్నాయి. ప్రతికూల, సానుకూలం. ప్రస్తుత ప్రభుత్వం సృష్టించిన దేశంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి ఈ సమావేశం జరిగింది" అని జార్ఖండ్ సిఎం & జెఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ చెప్పారు.
Jul 18, 2023, 12:34 pm IST

బెంగళూరులో జరిగిన ఉమ్మడి ప్రతిపక్ష సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు.
Jul 18, 2023, 12:32 pm IST

"బీహార్ ప్రజలు 'మహాఘటబంధన్'ని అంగీకరించడం లేదు. 2024లో బీహార్‌లోని మొత్తం 40 స్థానాలను ఎన్‌డిఎ గెలుచుకుంటుంది. 2025లో బీహార్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడుతుంది" అని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు.
Jul 18, 2023, 11:49 am IST

కర్ణాటకలోని బెంగళూరులో రెండో రోజు ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆ పార్టీ ఎంపీ మనోజ్ ఝా వచ్చారు.
Jul 18, 2023, 10:59 am IST

ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈరోజు బెంగళూరు చేరుకున్నారు. ఆయనకు కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ స్వాగతం పలికారు.
Jul 18, 2023, 10:57 am IST

చాందీ జీ కేరళ స్ఫూర్తికి, భారతదేశ స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
Jul 18, 2023, 10:19 am IST

బీజేపీ తమను పెద్ద ముప్పుగా భావిస్తోందని ఈ శక్తులన్నింటిపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.
Jul 18, 2023, 9:54 am IST

విపక్షాల భేటీకి వేదికగా ఉన్న తాజ్ వెస్ట్‌ ఎండ్ హోటల్ దృశ్యాలు
Jul 18, 2023, 7:25 am IST

నేడు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల భేటీ
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+