వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజా సర్వేలు: మోడీ తగ్గలేదు కానీ, బీజేపీకి రాహుల్ షాక్, తెరపైకి ప్రియాంక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే మరోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఓ సర్వే తేల్చి చెప్పింది. 293-309సీట్లతో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పింది. ఏబీపీ న్యూస్-లోక్ నీతి-సీఎస్డీఎస్ నిర్వహించిన ఈ సర్వేలో ఎన్డీఏ కూటమికి 34శాతం ఓట్లు వస్తాయని తేలింది.

Recommended Video

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: సర్వే!

అయితే, 2014 లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెల్చిన సీట్ల కంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సుమారు 30 సీట్లు(293-309) తక్కువగా రావడం గమనార్హం. 2014 లోకసభ ఎన్నికల్లో బీజేపీనే 282 సీట్లు సాధించగా, ఎన్డీఏతో కలిపుకుని 336 సీట్లను గెల్చుకుంది.

 మోడీ పాపులారిటీ తగ్గలేదు కానీ..

మోడీ పాపులారిటీ తగ్గలేదు కానీ..

కాగా, ఈ సర్వే ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని తేల్చింది. 2014 కంటే కాంగ్రెస్ పార్టీ కొంత బలపడినట్లుందని తెలిపింది. ఈ సర్వే ప్రకారం 30సీట్లు తక్కువగా వస్తాయి కాబట్టి.. మేజిక్ ఫిగర్ అయిన 272 సీట్లను బీజేపీ ఒంటరిగా కైవసం చేసుకోలేదు. దీంతో మిత్ర పక్షాల అవసరం బీజేపీకి తప్పదనే చెప్పాలి.

 కాంగ్రెస్ పార్టీకి లాభమే..

కాంగ్రెస్ పార్టీకి లాభమే..

బీజేపీ సీట్లు తగ్గుతున్నాయంటే ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం కూర్చే సంకేతంగానే భావించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏకు 122-132 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చేంది.

 ఇండియా టూడే కూడా..

ఇండియా టూడే కూడా..

ఇది ఇలా ఉంటే, ఇండియా టూడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 258 సీట్లు వస్తాయని పేర్కొంది. 2014కంటే(282) ఇది తక్కువే కావడం గమనార్హం.

 యూపీఏకు పెరగనున్న సీట్లు

యూపీఏకు పెరగనున్న సీట్లు

కాగా, ఇప్పటికప్పుడే లోకసభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 202 సీట్లు వస్తాయని, ఓటింగ్ శాతం 38కి చేరుతుందని తెలిపింది. ఇతర పార్టీలు 22శాతం ఓట్లతో 83సీట్లను కైవసం చేసుకుంటాయని పేర్కొంది.

 తెరపైకి సంచలనంగా ప్రియాంక

తెరపైకి సంచలనంగా ప్రియాంక

ఇండియాటూడే సర్వే ప్రకారం.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉన్న నేతల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ మూడో స్థానం(4శాతం)లో ఉండటం గమనార్హం. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని 3శాతంతో ఆమె తర్వాతి స్థానంలో ఉండటం గమనార్హం.

మోడీని అందుకోలేని స్థితిలో రాహుల్

మోడీని అందుకోలేని స్థితిలో రాహుల్

ఇండియాటూడే-కార్వీ సర్వే ప్రకారం.. తదుపరి ప్రధాని రేసులో ఉన్న వ్యక్తుల్లో నరేంద్ర మోడీ దరిదాపుల్లో కూడా మరే ఇతర లేకపోవడం గమనార్హం. 53శాతం మంది ప్రజలు మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు ఈ సర్వే తేల్చింది. రాహుల్ గాంధీకి 22శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నా.. మోడీని అందుకోవడానికి చాలా దూరంలో ఉండటం గమనార్హం. స్వాతంత్ర్యం తర్వాత ఉత్తమ ప్రధాని మోడీనే అని సర్వే తేల్చింది. మోడీ బాగా పనిచేస్తున్నారని 41శాతం మంది చెబుతుండగా, 25శాతం మాత్రం సగటుగానే పనిచేస్తున్నారని తేల్చేశారు.

English summary
The BJP-led National Democratic Alliance will come back to power with 293-309 seats if snap Lok Sabha polls are held, a survey has claimed. The survey conducted by ABP News-Lokniti-CSDS said that the NDA will get 34 per cent of the vote share in case of a snap poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X