అఫ్రిదిపై మండిపడ్డ ఎంపీ గౌతమ్ గంబీర్.... మనిషి పెరిగినా బుద్ది పెరగలేదని ఫైర్
Recommended Video
పాకిస్థాన్ క్రికెటర్ ఆఫ్రిది పై మాజీ క్రికెటర్ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపుమేరకు ఎల్‌వోసీ వెంట పర్యటిస్తానని ప్రకటించిన అఫ్రిదిపై గౌతమ్ గంబీర్ మండిపడ్డారు. కొంతమందికి ఎప్పటికి బుద్ది రాదని, వారి మెదడు ఎప్పటికి ఎదగదని అన్నారు, క్రికెట్ ఆడేందుకు వయస్సు పెరిగిదంది కాని బుద్ది మాత్రం పెరగదని వ్యాఖ్యానించారు.
కశ్మీర్‌పై అంతర్గత పోరు కొనసాగిస్తున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇటివల కశ్మీర్ అవర్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కశ్మీరీల కోసం పాకిస్థన్ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పిన ఆయన, పాకిస్థానీయులు కశ్మీర్ ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం వారానికి ఒక గంట కృషి చేయాలని అన్నారు. ఇందుకోసం యువత ముందుకు వచ్చి భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.

దీంతో పాక్ ప్రధాని పిలుపును అందుకున్న క్రికెటర్ షాయిద్ అఫ్రిదీ శుక్రవారం తాను ఓ నిరసన కార్యక్రమానికి హజరవుతానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల ఆరవ తేదీన అమరవీరుడి కుటుంభాన్ని కూడ పరార్శిస్తానని చెప్పారు. అనంతరం ఎల్‌వోసీ వెంట పర్యటిస్తానని అన్నాడు.మరోవైపు మిగతా వారు కూడ కశ్మీరీలకు అండగా ఉండాలని ఆప్రిధి సైతం పిలుపునిచ్చాడు. దీంతో ఆగ్రహం చెందిన గౌతం గంబీర్ తోటి క్రికెట్ ఆటగాడిపై విరుచుకుపడ్డాడు.
ఇక గౌతమ్ గంబీర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత సోషల్ మీడీయాలో ఎప్పటికప్పుడు చురకుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పలు అంశాలపై ముఖ్యంగా కశ్మీర్ అంశంపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాడు. ఇక క్రికెటర్‌గా ఉన్న సమయంలో కూడ గంబీర్, అఫ్రిదిలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న విషయం తెలిసిందే.. పలు సార్లు ఇద్దరి మధ్య ఘర్షణ వాతవరణం కూడ నెలకొనడంతో ఇతర ఆటగాళ్లు సర్ధి చెప్పాల్సిన పరిస్థితి.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications