బీజేపీ ఎంపీలపై కేసు.. ఎయిర్ పోర్టులో రూల్స్ బ్రేక్, కేసు..
బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ.. ఏడుగురిపై కేసు నమోదైంది. తమ సొంత (చార్టెట్) ప్లైట్ టేకాఫ్ కోసం ట్రాఫిక్ క్లియర్ చేయడంపై వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వీరిపై డియోఘర్ విమానాశ్రయానికి చెందిన డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు ఫైల్ చేశారు.

వీరిపై కేసు
ఎంపీలు, అనుచరులతోపాటు.. ఎయిర్ పోర్టు డైరెక్టర్‌పై కూడా కేసు నమోదు చేశారు. గత నెల 31వ తేదీన నిషికాంత్ దూబె, అతని కుమారుడు కనిష్క్ కాంత్ దూబె, మహికాంత్ దూబె, ఎంపీ మనోజ్ తివారీ, ముఖేశ్ పాతక్, దేవత పాండే, పింటు తివారీ ఎయిర్ పోర్టులో గల హై సెక్యూరిటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లోకి ప్రవేశించారు. దీనికి వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు.

చార్టర్ ఫ్లైట్ కోసం
అక్కడ వారు సిబ్బందిని బలవంతం చేసి.. తమ సొంత చార్టర్ ప్లైట్ ల్యాండ్ అయ్యేలా చూశారు. ఇదీ ఇటీవలె నెలకొల్పారు. రాత్రి వేళలో పనిచేయడం లేదు. సూర్యాస్తమయం వచ్చే అరగంట ముందు విమాన సేవలను నిలిపివేస్తున్నారు. ఆ రోజు 6.03 గంటలకు సూర్యస్తామయం కాగా.. వీరి విమానం మాత్రం 6.17 గంటలకు ల్యాండయ్యింది.

అనుమతి తీసుకున్నామే..
ఘటనపై నిషికాంత్ దూబె స్పందించారు. ఎయిర్ పోర్టు సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. ఎయిర్ పోర్టు డైరెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నామని తెలిపారు. ఈ అంశంపై తాను పోరాడేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. మరోవైపు శుక్రవారం రాత్రి ఇదే అంశంపై డియోఘర్ జిల్లా కలెక్టర్ మంజునాథ్ భజంత్రికి దూబేతో డిస్కషన్ జరిగింది. తమ సొంత విమానం ల్యాండ్ చేసేందుకు ఎంపీకి అధికారం ఎక్కడిది అని అడిగారు.

రూల్స్ చదవండి
మీరు ఏవియేషన్ రూల్స్ చదవాలని దూబే కోరారు. ఓ కలెక్టర్‌గా దేశం.. మీ నుంచి మంచిని ఆశిస్తోందని తెలిపారు. ఘటన విచారణ క్రమంలో ఉందన్నారు. రూల్స్ చదివిన తర్వాతే కామెంట్స్ చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications