MH Polls: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ రెండో జాబితా విడుదల-ఈసారి 22 మందితో..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న అధికార బీజేపీ ఇవాళ 22 మందితో అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. ఇందులో పలువురు సీనియర్లు, కొత్తగా పోటీ చేస్తున్న వారు కూడా ఉన్నారు. అధికార మహాయుతి కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. తమకు లభించిన కోటా ప్రకారం వరుసగా అభ్యర్ధుల జాబితాలను ప్రకటిస్తోంది.

ఇవాళ బీజేపీ విడుదల చేసిన మహారాష్ట్ర అసెంబ్లీ అభ్యర్ధుల రెండో జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ప్రకాష్ భర్సకలే (అకోట్), దేవయాని ఫరాండే (నాసిక్ సెంట్రల్), కుమార్ అయాలానీ (ఉల్హాస్‌నగర్), రవీంద్ర పాటిల్ (పెన్), భీంరావ్ తాప్‌కిర్ (ఖడక్‌వాస్లా), సునీల్ కాంబ్లే (పూణే కంటోన్మెంట్), సమాధాన్ ఔతాడే (పంధర్‌పూర్) ఉన్నారు.
మిగతా చోట్ల కొత్త వారికి అవకాశం దక్కింది.

BJP releases second list with 22 candidates for Maharashtra polls

ఈ జాబితాతో కలిపి బీజేపీ మొత్తం 121 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇప్పటికే విడుదలైన తొలి జాబితాలో బీజేపీ నుంచి 99 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. వచ్చే నెలలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ , శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపితో కూడిన మహాయుతి కూటమిగా పోటీ చేస్తున్నాయి. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మిగిలిన ఏడెనిమిది సీట్ల కేటాయింపుపై మూడు మిత్రపక్షాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+