మోడీ వల్లే, పాత స్నేహ బంధం: నితీశ్‌తో సిన్హా భేటీ
పాట్నా: బీహార్‌లో మహాకూటమి గెలుపు ప్రజా గెలుపని బీజేపీ ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నితీశ్ కుమార్ సారథ్యంలోని మాహాకూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
సీఎం నితీశ్ కుమార్‌తో సోమవారం సినీ నటుడు శత్రుఘ్న సిన్హా భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ మాది చాలా పాత స్నేహ బంధం అని తెలిపారు. మా పార్టీ అధిష్టానం తీరువల్లే బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందన్నారు.

నితీశ్‌తో భేటీ అవడం బీజేపీని ఇబ్బంది కలిగించదన్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించి ఉంటే తాను పార్టీలో ఉండేవాడిని కాదన్నారు. నితీశ్‌ని కలవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. బీజేపీకి నేను శత్రువుని కాదు. గత కొన్ని ఏళ్లుగా నిబద్ధత గల పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు.
బీహార్ ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో చర్చ జరగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓటమికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. బీహార్‌లో స్థానిక నేతలను విస్మరించడం వల్లే బీజేపీ ఓటమి పాలైందన్నారు. ప్రధాని మోడీ ప్రచారం చేయకంటే ఆ మాత్రం సీట్లు కూడా వచ్చి ఉండేవి కావన్నారు.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచడంపై పార్టీ నాయకత్వంపై గతంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల్లో హేమమాలిని, అజయ్ దేవగన్‌లతో బీజేపీ ప్రచారం చేయించింది. అయితే వీరి ప్రచారానికి ప్రజలైతే హాజరయ్యారు గానీ ఓట్లు మాత్రం రాలలేదు.
ఓ బహిరంగ సభలో జేడీయూ ముఖ్యనేత, సీఎం నితీష్ కుమార్‌ను పొగడడంతో శత్రుఘ్న సిన్హాను పార్టీ అధినాయకత్వం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే.
243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో మాహాకూటమి 178 స్ధానాల్లో విజయం సాధించగా, ఎన్డీయే కూటమి కేవలం 58 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. 14 జిల్లాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు. మరో 7 స్ధానాల్లో ఇతరులు విజయం సాధించారు.
Lessons learnt...hopefully. Time to forgive, forget & work towards a better future with passion, dedication, teamwork, humility, commitment.
— Shatrughan Sinha (@ShatruganSinha) November 9, 2015 Life goes on.. Choro kal ki baatein Kal ki baat puraani naye dhang se likhenge hum mil kar nayi kahani, hum Hindustani Jai Bihar, Jai Bharat
— Shatrughan Sinha (@ShatruganSinha) November 9, 2015 -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications