బీజేపీ-శివసేన కూటమి విజయం, ఒంటరిగా...: సర్వే

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించవచ్చునని సర్వేలో వెల్లడైంది. ఏబీపీ న్యూస్ - ఏసీ నీల్సన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో 288 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 200 సీట్లను కైవసం చేసుకోవచ్చునని అంచనా వేసింది.

దాదాపు పదమూడువేల మంది పైన 72 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సర్వే చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం ఈ ఎన్నికల పైన ఉంటుందని పేర్కొంది. సర్వే వివరాలను శుక్రవారం వెలువరించింది. బీజేపీ సొంతగా 107 సీట్లను పొందవచ్చునని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ బలం 2009లో సాధించిన 82 స్థానాల నుండి 40కి పడిపోవచ్చునని అంచనా వేసింది.

BJP-Sena to sweep Maharashtra, Survey says

శివసేనతో పొత్తు కుదరని పక్షంలోను బీజేపీ సుమారు 103 స్థానాలను గెలుచుకోవచ్చునని పేర్కొంది. శివసేన 64 స్థానాలను గెలుచుకునే అవకాశముంది. బీజేపీ-శివసేన-ఆర్పీఐ-స్వాభిమాని షెట్కారి సంఘటనతో కూడిన మహా కూటమి ఘన విజయం సాధించనుందని సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+