బీజేపీ నేత పాడు పని.. కూతురు వయసున్న అమ్మాయితో..!
సమాజంలో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తూనే ఉన్నాయి. ఆడపిల్లలు అయితే చాలు అన్నట్లుగా మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నేతలు సైతం ఇలాంటి పనులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఓ బీజేపీ నేత.. కూతురు వయసున్న అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గౌరీ శంకర్ అగ్రహారి మైనర్ బాలికతో అసభ్యకరంగా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటన జరిగి వారం రోజులు అయింది. అయితే తాజాగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.

సిద్ధార్థ్‌నగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గౌరీ శంకర్ అగ్రహారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ నేత మాత్రం ఫోటోలో ఉన్నది తాను కాదంటూ బుకాయిస్తున్నాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ ఓ బీజేపీ నేత రోడ్డుపైనే కారు ఆపి మహిళలతో శృంగారం చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications