మాకు పూర్తి మెజారిటీ ఉంది, బలాన్ని నిరూపించుకొంటాం: బిజెపి ఎమ్మెల్యే ప్రభు చవాన్
బెంగుళూరు: తమకు పూర్తి మెజారిటీ ఉందని బిజెపికి చెందిన ఎమ్మెల్యే ప్రభు చవాన్ అభిప్రాయపడ్డారు. అయితే సాయంత్రం వరకు వేచి చూద్దాం ఏం జరుగుతోందోనన్నారు. అంతేకాదు సాయంత్రం తాము మెజారిటీని నిరూపించుకొంటామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
మే 19వ తేదిన యడ్యూరప్ప అసెంబ్లీలో విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బిజెపికి 104 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 38 సీట్లు, జెడి(ఎస్)కు 38 సీట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు విజయం సాధించారు.

అయితే ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మే 19వ తేది సాయంత్రం యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్, జెడి(ఎస్) పార్టీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
బిజెపి నేతలు కూడ విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు. ఈ తరుణంలో కర్ణాటకలో యడ్యూరప్ప విశ్వాస పరీక్షపై అందరి కళ్ళు ఉన్నాయి. ఈ తరుణంలో బిజెపి ఎమ్మెల్యే తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
ఇప్పటికే తమకు పూర్తిస్థాయి మెజారిటీ ఉందని బీదర్ జిల్లాలోని ఆరద్ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే ప్రభు చవాన్ చెప్పారు. అంతేకాదు సాయంత్రం వరకు ఎదురు చూద్దామని ఆయన మీడియాకు సూచించారు. సాయంత్రం పూట విశ్వాసపరీక్షలో తాము విజయం సాధిస్తామని ప్రభు ధీమాను వ్యక్తం చేశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications