Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Blade company: 4 లక్షల మందికి నామం, అర్దగంట వీడియో అంతే, రూ కోట్లు స్వాహా, పోటుగాడు !

బెంగళూరు: రోజుకు అర్దగంట 60 వీడియోలు చూడండి, రోజుకు మీకు రూ. 240 ఇస్తాము, నెల రోజులకు మీకు రూ. 7, 200 వస్తుంది. మీరు ఇంట్లో కుర్చుని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, మీ అకౌంట్ డబ్బులు వచ్చిపడిపోతాయి. మీకు ఓపిక ఉంటే ఎక్కువ గంటలు వీడియోలు చూడండి, సంవత్సరానికి రూ. 86, 400 వస్తాయి. మీరు మీ మొబైల్ ఫోన్ లో మా వెబ్ సైట్ లో వీడియోలు మాత్రమే చూడండి అంటూ ప్రకటన ఇచ్చేశారు. మా కంపెనీ సభ్యతం తీసుకోవాలంటే కేవలం రూ. 1,009 మాత్రం చెల్లించాని చెప్పారు. అంతే నాలుగు వందల మంది కాదు ఏకంగా నాలుగు లక్షల మంది జా లైఫ్ స్టైల్ డాట్ కామ్ కంపెనీలో సభ్యత్వం తీసుకున్నారు. నెలలు గడిచిపోయినా అకౌంట్ లో డబ్బులు మాత్రం జమకాకపోవడంతో ఐటీ హబ్ లో కేటుగాడి యవ్వారం మొత్తం క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వరకు వెళ్లింది. బెంగళూరులో పోటుగాళ్లు లేరని కేరళ నుంచి వచ్చి పోడిచేసిన బోగస్ కంపెనీ ఎండీని పోలీసులు అరెస్టు చేశారు. జాలైఫ్ స్టైల్ పేరుతో ప్రజల సోమ్ముతో తన లైఫ్ చైంజ్ చేసుకున్న పోటుగాడిని ఇప్పుడు పోలీసులు విచారణ చేసి పూర్తి బండారం బయటకు లాగుతున్నారు.

ఐటీ హబ్ లో జా లైఫ్ స్టైల్ కంపెనీ

ఐటీ హబ్ లో జా లైఫ్ స్టైల్ కంపెనీ


కేరళలోని ఎర్నాకులంలోని కులిమలైలో నివాసం ఉంటున్న కేవి. జాని బెంగళూరు చేరుకుని వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. బెంగళూరులోని బసవేశ్వరనగర్ లోని కేహెచ్ బీ కాలనీలో జేఎఎ లైఫ్ స్టైల్ ఇండియా ప్రై.లి. పేరుతో ఓ ప్రకటనల కార్యాలయం ప్రారంభించారు. చూడటానికి హైఫై లెవల్లో కంపెనీ కార్యాలయం ఏర్పాటు చేసిన జానీ తరువాత అమాయకులను ఆకర్షించడానికి ప్రయత్నించాడు.

వీడియోలు మాత్రం చూడండి..... డబ్బులు మేము ఇస్తాం

వీడియోలు మాత్రం చూడండి..... డబ్బులు మేము ఇస్తాం

రోజుకు అర్దగంట 60 వీడియోలు చూడండి, రోజుకు మీకు రూ. 240 ఇస్తాము, నెల రోజులకు మీకు రూ. 7, 200 వస్తుంది. మీరు ఇంట్లో కుర్చుని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, మీ అకౌంట్ డబ్బులు వచ్చిపడిపోతాయి అంటూ ప్రకటనలు ఇచ్చేశాడు. జా లైఫ్ స్టైల్ కంపెనీ ప్రకటనలు చూసిన ప్రజలు ఎగేసుకుంటూ వెళ్లారు.

Recommended Video

    Rajamouli గురించి తెలిసే Mahesh Babu ఇలా | Mahesh Babu Rajamouli Movie || Oneindia Telugu
    బాటా రేట్ల టైపులో ఫ్యాన్సీ నెంబర్ సభ్యత్వం

    బాటా రేట్ల టైపులో ఫ్యాన్సీ నెంబర్ సభ్యత్వం

    ప్రతిరోజూ మీరు అర్దగంట పాటు సంవత్సరానికి మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని గంటలు వీడియోలు చూడండి అని మాయమాటలు చెప్పారు. మీరు మేము చెప్పినట్లు చేస్తే మీకు సంవత్సరానికి రూ. 86, 400 వస్తాయి. మీరు మీ మొబైల్ ఫోన్ లో మా వెబ్ సైట్ లో వీడియోలు మాత్రమే చూడండి అంటూ ప్రకటన ఇచ్చేశారు. మా కంపెనీ సభ్యతం తీసుకోవాలంటే కేవలం రూ. 1,009 మాత్రం చెల్లించాలని చెప్పారు.

     4 లక్షల మందికి నామాలు

    4 లక్షల మందికి నామాలు

    జా లైఫ్ స్టైల్ ఇండియా కంపెనీలో ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మందికి పైగా సభ్యత్వం తీసుకున్నారు. కొన్ని నెలల్లోనే నాలుగు లక్షల మందిని చేర్చుకున్న జానీ సుమారు రూ. 4 కోట్లకు పైగా ప్రజల సోమ్మును అతని అకౌంట్ లో వేసుకున్నాడు. అయితే ఇంత వరకు వీడియోలు చేసిన అమాయకులకు ఒక్కరూపాయి కూడా ఇవ్వకపోవడంతో బాధితులు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    కేరళ నుంచి వచ్చిన పోటుగాడు

    కేరళ నుంచి వచ్చిన పోటుగాడు

    వేలాది మంది ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బ్లేడ్ కంపెనీ ప్రారంభించి ప్రజలకు నున్నగా గుండు కోట్టేసిన కిలాడీ కేటుగాడు జానీని అరెస్టు చేశారు. బెంగళూరులో పోటుగాళ్లు లేరని కేరళ నుంచి వచ్చి ఇక్కడి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేశాడని వెలుగు చూడటంతో ప్రజలు షాక్ అయ్యారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+