Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Blogger: భార్య ఫ్యాషన్ బ్లాగర్, కాళ్లు, చేతులు కట్టేసి 4వ అంతస్తు పై నుంచి తోసేసిన భర్త, కాజల్ !

ఆగ్రా/న్యూఢిల్లీ: యువతి, యువకుడు పెళ్లి చేసుకుని మొదట్లో సంతోషంగా కాపురం చేశారు. భార్య ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. టీచర్ ఉద్యోగం చేస్తున్న యువతి ఫ్యాషన్ బ్లాగ్ నిర్వహిస్తూ డబ్బులు బాగా సంపాధిస్తోంది. ఉద్యోగం చెయ్యకుండా భర్త గాలికి తిరుగుతున్నాడు. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులను భార్య పోషిస్తోంది. భార్య కష్టపడి డబ్బు సంపాధించి తనను, తన కుటుంబ సభ్యులను పోషిస్తోందని భార్య మీద జాలి చూపించాల్సిన భర్త ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో భర్త, అతని కుటుంబ సభ్యులు టార్చర్ తట్టుకోలేని ఆమె వేరే ఊరిలోని స్నేహితుడి అపార్ట్ మెంట్ కు వెళ్లిపోయింది. భార్య నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి ఇద్దరు యువతులతో పాటు ఇద్దరు మగాళ్లతో కలిసి వెళ్లిన భర్త రెచ్చిపోయాడు. భార్యకు నరకం చూపించి ఆమె స్నేహితుడిని బాత్ రూమ్ లో వేసి చితకబాదేశారు. తరువాత భార్య కాళ్లు, చేతులు కట్టేసి అపార్ట్ మెంట్ లోని నాలుగో అంతస్తు నుంచి ఆమెను కిందకు తోసేసి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

 కొంతకాలం లేడీ టీచర్ లైఫ్ హ్యాపీ

కొంతకాలం లేడీ టీచర్ లైఫ్ హ్యాపీ

ఘాజియాబాద్ కు చెందిన ఆకాష్, ఢిల్లీకి చెందిన రితికా సింగ్ (30) అనే యువతి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకు్న మొదట్లో ఆకాష్, రితికా సింగ్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రితికా సింగ్ గాజియాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. కొంతకాలం ఆకాష్ అతని భార్య రితికా సింగ్ తో సంతోషంగా కాపురం చేశారు.

 రితికా సింగ్ ఫ్యాషన్ బ్లాగర్

రితికా సింగ్ ఫ్యాషన్ బ్లాగర్

టీచర్ ఉద్యోగం చేస్తున్న రితికా సింగ్ ఫ్యాషన్ బ్లాగ్ నిర్వహిస్తూ డబ్బులు బాగా సంపాధిస్తోంది. అకాశ్ కుటుంబ సభ్యులతో కలిసి రితికా సింగ్ ఒకే ఇంటిలో నివాసం ఉండేది. రితికా సింగ్ భర్త అకాశ్ ఎలాంటి ఉద్యోగం చెయ్యకుండా గాలికి తిరుగుతున్నాడు. అకాశ్ తో పాటు అతని కుటుంబ సభ్యులను రితికా సింగ్ పోషిస్తోంది. భర్త అకాశ్ కు, అతని కుటుంబ సభ్యులకు డబ్బులు రితికా సింగ్ ఇచ్చేది.

 భార్య మీద డౌట్

భార్య మీద డౌట్

రితికా సింగ్ కష్టపడి డబ్బు సంపాధించి తనను, తన కుటుంబ సభ్యులను పోషిస్తోందని భార్య మీద జాలి చూపించాల్సిన ఆమె భర్త అకాశ్ ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. భార్య రితికా సింగ్ మీద అనుమాంతో అకాశ్ ఆమెను టార్చర్ పెట్టాడు. భర్త అకాశ్, అతని కుటుంబ సభ్యులు టార్చర్ తట్టుకోలేని రితికా సింగ్ ఆగ్రాలోని స్నేహితుడు విపుల్ అపార్ట్ మెంట్ కు వెళ్లిపోయింది.

 ఆగ్రాకు వెళ్లిన భర్త ఏం చేశాడంటే ?

ఆగ్రాకు వెళ్లిన భర్త ఏం చేశాడంటే ?

భార్య రితికా సింగ్ నివాసం ఉంటున్న ఆగ్రాలోని ఓంశ్రీ అపార్ట్ మెంట్ లోకి కుసుమా, కాజల్ అనే ఇద్దరు యువతులతో పాటు ఇద్దరు మగాళ్లతో కలిసి వెళ్లిన అకాశ్ అక్కడ అతని భర్యా మీద రెచ్చిపోయాడు. భార్య రితికా సింగ్ కు నరకం చూపించి ఆమె స్నేహితుడు విపుల్ ను బాత్ రూమ్ లో వేసి చితకబాదేశారు.

Recommended Video

    పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
     భార్య చేతులు, కాళ్లు కట్టేసి అపార్ట్ మెంట్ పై నుంచి ?

    భార్య చేతులు, కాళ్లు కట్టేసి అపార్ట్ మెంట్ పై నుంచి ?

    భార్య రితికా సింగ్ కాళ్లు, చేతులు కట్టేసిన అకాశ్, కాజల్, కుసుమా, మరో ఇద్దరు కలిసి ఆమెను అపార్ట్ మెంట్ లోని నాలుగో అంతస్తు పై నుంచి కిందకు తోసేసి దారుణంగా హత్య చేశారు. పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. రితికా సింగ్ ను హత్య చెయ్యకముందు ఆమె శరీరం మీద సిగరేట్ తో కాల్చి నరకం చూపించిన గాయాలు ఉన్నాయని వెలుగు చూసింది రితికా సింగ్ హత్య కేసులో ఆమె భర్త ఆకాశ్ తో పాటు కాజల్, కుసుమాను అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+