Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్లడ్ డొనేషన్: ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు?

రక్తదానం

రక్తదానం గురించి తెలుసుకునే ముందు ముందు రక్తం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన రక్తంలో ముఖ్యంగా మూడు రకాల రక్త కణాలు ఉంటాయి.

ఎర్ర రక్త కణాలు: శరీరం అంతా ఆక్సీజన్ సరఫరా చేస్తాయి.

తెల్ల రక్త కణాలు: మన శరీరాన్ని అనారోగ్యాల నుంచి కాపాడతాయి.

ప్లేట్‌లెట్లు: రక్తస్రావం జరగకుండా ఆపడానికి ఉపయోగపడతాయి.

అలాగే రక్తంలో ముఖ్యమైన మరో పదార్థం ప్లాస్మా. రక్తకణాలు అన్ని ఉండే ద్రవపదార్థం ఇది. ఇందులో రక్తం గడ్డకట్టకుండా ఉండే ప్రోటీన్లు ఉంటాయి.

ఒక యూనిట్ రక్తం అంటే 350 మి.లీ. ఒక యూనిట్ రక్తం ఎక్కించడం వల్ల దాదాపు 1.2 గ్రాముల హీమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తస్రావాన్ని బట్టి, లేక రక్తహీనతను బట్టి కొన్ని సందర్భాలలో 4-5 లేదా ఇంకా ఎక్కువ యూనిట్ల రక్తం ఎక్కించే అవసరం కలగవచ్చు.

రక్తదానం

రక్తం ఎవరికి అవసరం?

ప్రతీ సంవత్సరం మన దేశంలో సుమారు నాలుగు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు నమోదు అవుతుండగా, దాదాపు లక్షన్నర మరణాలు రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్నాయి. అందులో ఎన్నో మరణాలు అధిక రక్తస్రావంతో, సమయానికి రక్తం అందక జరిగేవే.

కాన్పు సమయంలో లేదా రక్తహీనత వల్ల లేదా అధిక రక్తస్రావంతో ఎందరో గర్భవతులు చనిపోతున్నారు. గర్భవతులకు రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది.

రక్తకణాలు అధికంగా నాశనమయ్యే తలసేమియా వ్యాధి గ్రస్తులకు, జీవితాంతం తరుచూ రక్తం ఎక్కించాల్సి ఉంటుంది.

రక్తం గడ్డ కట్టే వ్యవస్థలో లోపాలు ఉన్న వారికి అంటే, హీమోఫిలియా వంటి సమస్యలు ఉన్న వారికి, రక్తస్రావం జరిగినపుడు రక్తం ఎక్కించాలి.

క్యాన్సర్ వంటి వ్యాధి, లేక మలేరియా వంటి ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి కూడా రక్తం తగ్గిపోతూ ఉంటుంది.

పేగులకు సంబంధించిన సమస్యల వల్ల, మూత్ర పిండాల సమస్యల వల్ల, ఇంకా అనేక సమస్యలతో రక్తం తక్కువైన వారికి దానిని ఎక్కించే అవసరం కలగవచ్చు.

రక్తహీనత మన దేశంలో పురుషులలో 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, గర్భవతులలో 52% గా నమోదు అయింది.

హీమోగ్లోబిన్ 7 కన్నా తక్కువ ఉంటే ఎర్ర రక్తకణాలు ఎక్కించే అవసరం ఉంటుంది.

రక్తదానం

రక్తం ఎవరు ఇవ్వాలి?

18-65 సంవత్సరాల వయస్సు ఉన్న ఆరోగ్యవంతులు రక్తదానం చేయొచ్చు.

హీమోగ్లోబిన్ శాతం 12.5 గ్రా కన్నా ఎక్కువ ఉన్న వారు

రక్తం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు అంటే, హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వ్యాధులు లేని వారు రక్తం ఇవ్వడానికి అర్హులు.

లైంగిక సంక్రమణ వ్యాధులు అన్నీ రక్తమార్పిడి వల్ల వ్యాప్తి చెందుతాయి. కాబట్టి సిఫిలిస్, గొనోరియా, వంటి వ్యాధులు ఉన్న వారు కూడా రక్తదానం చేయకూడదు.

బీపీ (100-140/60-90), గుండె వేగం (60-100) సాధారణంగా ఉన్న వారు.

గుండె సంబంధిత లేక క్యాన్సర్ వంటి ఇతర తీవ్ర అనారోగ్యాలు లేని వారు ఇవ్వొచ్చు.

ధూమపానం చేసే వారు కూడా రక్తదానం చేయవచ్చు.

స్వయం ప్రతి రక్షక వ్యాధులు (autoimmune diseases) లేదా రక్తకణాల తయారీలో లోపాలు (hemoglobinopathies) ఉన్న వారు, ఏ రకమైన క్యాన్సర్ ఉన్న వారు, ఎప్పటికీ రక్తం ఇవ్వకూడదు.

దీర్ఘ కాలిక జబ్బులకు మందులు వాడుతున్న వారు వైద్యుని సలహా మేరకు రక్తదానం చేయాలి. వారు వాడుతున్న మందుల ప్రకారం రక్తదానానికి అర్హులా? కాదా? అనే విషయాన్ని వైద్యులు నిర్ధరిస్తారు.

మధుమేహంకి మందులు వాడుతున్న వారు, ఇతర ఏ సమస్య లేకపోతే రక్తదానం చేయవచ్చు. కానీ, ఇన్సులిన్ తీసుకుంటున్న వారు రక్తదానం చేయకూడదు.

సురక్షితమైన సూదితో పచ్చబొట్టు వేసుకున్న వారు రక్తదానం చేస్తే ఇబ్బంది ఉండదు. కానీ, అసురక్షితంగా వేయించుకున్న అనుమానం ఉంటే, ఒక ఆరు నెలల వరకు రక్తదానం జోలికి పోకూడదు.

టీకాలు తీసుకున్న వారైతే ఆ టీకాను బట్టి కొన్ని రోజులు రక్తదానం చేయకూడదు. అంటే డిఫ్తీరియా, పెట్రుసిస్, టెటనస్, పోలియో ఇంజెక్షన్, హెచ్‌పీవీ టీకాలు తీసుకుంటే రెండు వారాలు... మంప్స్, మీజిల్స్, రుబెల్లా, ఓరల్ పోలియో, ఎల్లో ఫీవర్, జేఈ, హెపటైటిస్ టీకా తీసుకున్నవారు నాలుగు వారాల తర్వాత రక్తదానం చేయవచ్చు.

రక్తదానం

ఎన్ని రోజులకు ఒకసారి రక్త దానం చేయవచ్చు?

ఆరోగ్యవంతులైన పురుషులు ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చు.

ఆరోగ్యవంతులైన మహిళలు ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.

ప్లేట్‌లెట్లు ప్రతీ వారం చొప్పున సంవత్సరానికి 24 సార్లు దానం చేయవచ్చును.

(రచయిత వైద్యురాలు, ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసమే ఈ కథనం)

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+