ఈ నెలలో రెండు పున్నములు- ఏం జరుగుతుంది?

న్యూఢిల్లీ: అంతరిక్షం.. అద్భుతాలమయం. ఈ విశ్వాంతరాల్లో సంభవించే ప్రతీదీ ఓ ఆశ్చర్యాన్ని కలిగించేదే. ప్రతి అద్భుతానికీ ఓ కారణం ఉంటుంది. కొద్దిరోజుల కిందటే పంచ గ్రహ కూటమి ఏర్పడింది. అయిదు గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేశాయి. బుధుడు, యురేనస్, గురుడు, నెప్ట్యూన్, శని గ్రహాలు.. ఆకాశంలో పరేడ్ చేశాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండానే నేరుగా వీక్షించగలిగారు.

ఇప్పుడు అలాంటి అరుదైన సందర్భం మరోసారి చోటు చేసుకోనుంది. ఈ నెలలో రెండు పున్నములు ఏర్పడబోతోన్నాయి. ఇందులో ఒకటి ఈ రాత్రికి సంభవించనుంది. ఈ నెలలో తొలి పౌర్ణమి ఇవ్వాళే. దీన్ని సూపర్‌ మూన్‌గా పిలుస్తారు. మరొకటి ఈ నెల 30వ తేదీన చోటు చేసుకుంటుంది. ఇది బ్లూ మూన్.

Blue supermoon

సాధారణంగా ఒక ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్‌మూన్‌లు ఏర్పడుతుంటాయి. ఆగస్టు 30వ తేదీన ఏర్పడబోయే సూపర్‌మూన్‌ మాత్రం చాలా అరుదు. అలాంటి సందర్భాన్ని మళ్లీ 2032 వరకు మనం చూడలేకపోవచ్చు. ఫుల్ మూన్ సమయంలో, జాబిల్లి కక్ష్య భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్‌మూన్ ఆవిష్కృతమౌతుంది.

సాధారణ పౌర్ణమి రోజుల కంటే కూడా సూపర్ మూన్ సమయంలో చందమామ మరింత ప్రకాశవంతంగా కనువిందు చేస్తాడు. పరిమాణంలోనూ భారీగా కనిపిస్తాడు. ఫార్మర్స్ అల్మానాక్ ప్రకారం చూసుకుంటే.. ఈ సంవత్సరంలో మొదటి పౌర్ణమి మంగళవారం మంగళవారం అంటే ఇవ్వాళే సంభవించింది. దీన్ని స్టర్జన్ సూపర్‌మూన్‌గా పిలుస్తారు.

స్టర్జన్ చంద్రుడిని గ్రీన్ కార్న్ మూన్, గ్రెయిన్ మూన్, ఫ్లయింగ్-అప్ మూన్, హార్వెస్ట్ మూన్, రైజింగ్ మూన్, బ్లాక్ చెర్రీస్ మూన్, మౌంటెన్ షాడో మూన్ అని కూడా పిలుస్తారు. ఒకే నెలలో రెండవసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మూన్‌గా భావిస్తారు. సగటున ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఇలాంటి సందర్భం ఏర్పడుతుంటుంది. ఒకే నెలలో రెండు పున్నములు సంభవిస్తుంటాయని నాసా తెలిపింది.

ఒక సూపర్‌మూన్, బ్లూ మూన్‌తో కలిసి రావడం అరుదైన సందర్భమే. ఇది చివరిసారిగా 2009 డిసెంబర్‌లో ఇది సంభవించిందని నాసా పేర్కొంది. మళ్లీ 2032 ఆగస్టులో ఇది ఏర్పడుతుంది. ఆగస్టు 30వ తేదీ నాటి పున్నమి చంద్రుడిని బ్లూ మూన్‌గా పిలుస్తారు. అంతే తప్ప చందమామ నిజంగా నీలం రంగులో కనిపించదు.

Blue supermoon

హిందూ సంప్రదాయంలో ఒకే నెలలో సంభవించే రెండు పున్నములకు ప్రాధాన్యత ఉంది. అధికమాసం ఏర్పడినప్పుడు ఇలాంటి అరుదైన సందర్భం సంభవిస్తుంటుంది. ఆ సమయంలో యజ్ఞ యాగాదులు చేయాలని పెద్దలు చెబుతుంటారు. ఇవ్వాళ కూడా తిరుమల సహా పలు ఆలయాల్లో విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+