వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి వస్తా.. సీఎంగా చన్నీకి మరో అవకాశం ఇవ్వండి.. పంజాబ్‌లో సోనూసూద్

|
Google Oneindia TeluguNews

ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు . రాజకీయల్లోకి రావాలని అనేక పార్టీలు తనను ఆహ్వానించాయని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ ప్రవేశం ఉంటుందని తేల్చిచెప్పారు. కానీ తన వద్ద తగినంత టీమ్ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను సామాజిక సేవా కార్యక్రమాలను అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. చాలా పార్టీలు రాజ్యసభ సీటు, ఇతర ఉన్నత పదవులు ఇస్తామంటూ ఆఫర్ చేశాయని పేర్కొన్నారు.

పంజాబ్ సీఎంగా చన్నీకి మరో సారి అవకాశం ఇవ్వండి..

పంజాబ్ సీఎంగా చన్నీకి మరో సారి అవకాశం ఇవ్వండి..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీకి మరో సారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా చన్నీ అతి తక్కువ సయమయంలోనే పంజాబ్ అభివృద్ధికి కృషి చేశారని ప్రశంసించారు.

చన్నీ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిజాయితీపరుడని. ఎప్పుడూ హృదయపూర్వకంగా మాట్లాడతారని సోనూసూద్ తెలిపారు.. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు.

సోదరి మాళవిక తరుపున ప్రచారం

సోదరి మాళవిక తరుపున ప్రచారం

ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్‌ రాజకీయ నేతగా ఎలా ఉంటారనేది తనకు పెద్దగా తెలియదని సోనూ సూద్‌ పేర్కొన్నారు. చాలా ఏళ్ల క్రితం ఒక కళాకారుడిగా మాత్రమే ఆయనను కలిశానని చెప్పారు . తనకు ఏపార్టీలతో సంబంధం లేదని తెలిపారు. తన సోదరి మాళవిక సూద్ సచార్ కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్నారని వెల్లడించారు. మోగా అసెంబ్లీ నుంచి బరిలో ఉన్న తనకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

మోగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట

మోగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట

కాంగ్రెస్ పార్టీ మోగాలో అనేక అభివృద్ధి పనులు చేసిందన్నారు సోనూసూద్. అందుకే మోగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిందని పేర్కొన్నారు. మోగాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ధర్మశాలలను తమ కుటుంబమే నిర్మించిందని సోనూసూద్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలోని అంశాలను నేరవేర్చగలదని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. అందుకే తన సోదరి మాళివిక కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచదని భావిస్తన్నట్లు పేర్కొన్నారు. మాళవికను భారీ మేజార్టీతో ప్రజలు గెలిపించాలని కోరారు.

English summary
Actor Sonu Sood Said Give another chance to Charanjit Singh Channi as Punjab CM..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X