Singer: ఫేమస్ సింగర్ మీద అత్యాచారం కేసు పెట్టిన లేడీ ఫ్యాషన్ డిజైనర్, అసలు మ్యాటర్ ఏమిటంటే ? !
ముంబాయి: ప్రముఖ సింగర్ వివాదంలో చిక్కుకున్నాడు. బాలీవుడ్ తో పాటు ఇతర బాషల సినిమాలకు పాటలు పాడుతున్న సింగర్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని, సినిమాలలో చాన్స్ ఇప్పిస్తానని సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నాడని ఓ లేడీ ఫ్యాషన్ డిజైనర్ ఆరోపిస్తోంది. సినిమా చాన్స్ ల విషయంలో చర్చించాలని సింగర్ అతని ఫ్లాట్ కు పిలిపించుకుని తన మీద అత్యాచారం చేశాడని లేడీ ఫ్యాషన్ డిజైనర్ ఆయన మీద కేసు పెట్టింది. పోలీసులు ప్రముఖ సింగర్ మీద అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే ఆమె ఎవరో కూడా తనకు తెలీదని, తనను నిలువునా ముంచేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆ సింగర్ ఆరోపిస్తున్నాడు.

బాలీవుడ్ ఫేమస్ సింగర్
బాలీవుడ్ లో రాహుల్ జైన్ ప్రముఖ సింగర్స్ లో ఒక్కడు అయ్యాడు. బాలీవుడ్ ఫేమస్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ జైన్ బాలీవుడ్ సినిమాలకు పాటలు పాడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ జైన్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

అత్యాచారం కేసు పెట్టిన లేడీ ఫ్యాషన్ డిజైనర్
బాలీవుడ్ తో పాటు ఇతర బాషల సినిమాలకు పాటలు పాడుతున్న సింగర్ రాహుల్ జైన్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని, సినిమాలలో చాన్స్ ఇప్పిస్తానని సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నాడని ముంబాయికి చెందిన ఓ లేడీ ఫ్యాషన్ డిజైనర్ ఆరోపిస్తోంది. సినిమా చాన్స్ ల విషయంలో చర్చించాలని సింగర్ రాహుల్ జైన్ ముంబాయిలోని అతని ఫ్లాట్ కు పిలిపించుకుని తన మీద అత్యాచారం చేశాడని లేడీ ఫ్యాషన్ డిజైనర్ ఆయన మీద స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.
నాకు ఏపాపం తెలీదు
తన మీద అత్యాచారం కేసు పెట్టిన ఆమె ఎవరో కూడా తనకు తెలీదని, నేను ఎవ్వరిని సోషల్ మీడియాలో పరిచయం చేసుకోలేదని బాలీవుడ్ సింగర్ రాహుల్ జైన్ అంటున్నారు. బాలీవుడ్ లో తన ఎదుగుదల చూసి ఓర్చుకోలేని కొందరు తనను నిలువునా ముంచేయడానికి ప్రయత్నిస్తున్నారని సింగర్ రాహుల్ జైన్ ఆరోపిస్తున్నాడు.
అత్యాచారం కేసులో బుకైపోయిన సింగర్
గతంలో కూడా తన మీద ఓ మహిళ ఇలాంటి కేసు పెట్టిందని, అయితే కోర్టులో తనకు న్యాయం చిక్కిందని బాలీవుడ్ సింగర్ రాహుల్ జైన్ అంటున్నాడు. అయితే సింగర్ రాహుల్ జైన్ మీద అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారు. అయితే సింగర్ రాహుల్ జైన్ ను ఇంత వరకు పోలీసులు అరెస్టు చెయ్యలేదని, ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ కూడా చెయ్యలేదని సమాచారం.












Click it and Unblock the Notifications