హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కస్టడీకి భత్కల్: సికింద్రాబాద్‌లో బాంబు కలకలం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. రైల్వే డిఎస్పి మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిదో నెంబరు ప్లాట్ ఫాం వద్ద బాంబు ఉందంటూ కంట్రోల్ రూంకి ఫోన్‌కాల్ వచ్చింది.

ఫోన్‌కాల్ రావడంతో అప్రమత్తమైన జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు.. దుండగులు ఫోన్‌కాల్‌ ద్వారా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చినట్లు, సమాచారం ఇచ్చిన వ్యక్తి గురించి దర్యాప్తు చేస్తుట్లు మురళీధర్ తెలిపారు.

yasin bhatkal

యాసిన్ భత్కల్‌కు 14రోజుల పోలీసు కస్టడీ

న్యూఢిల్లీ: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌కు కోర్టు 14 రోజులపాటు పోలీసు కస్టడీ విధించింది. భత్కల్ సహచరుడు అసదుల్లా అక్తర్‌ను కూడా పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు.

గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ఇద్దరు నిందితులకు మాస్కులు వేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంతకుముందు అక్తర్‌ను ఎన్ఐఏ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. హైదరాబాద్ ఎన్ఐఏ విభాగం ఫిబ్రవరి 21న జరిగిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసుతో సంబంధంపై అక్తర్‌ను విచారించింది.

English summary
Mild tension prevailed at the Secunderabad Railway Station for a few hours on Tuesday when an anonymous person called up the control room claiming that a bomb has been planted at Platform No 9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X