రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ కు నో బెయిల్, నేడు ఏం జరుగుతుందో ? సీఎం, హీరో సుశాంత్ ఎఫెక్ట్, వస్తే !

ముంబాయి/ న్యూఢిల్లీ: మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2018 నాటి అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అరెస్టు అయిన అర్నబ్ గోస్వామి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చెయ్యాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చెయ్యకూడదని, కేసు విచారణలో ఉందని, ఆయన పలుకుబడితో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్, ముంబాయి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు అసంపూర్తిగా ముగియండంతో అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు కాలేదు. బాలీవుడ్ హీరో సుశాంత్ కేసు విషయంలో మహారాష్ట్ర సీఎంకు వ్యతిరేకంగా టీవీలో చర్చా కార్యక్రమాలు చేపట్టిన తరువాత అర్నబ్ గోస్వామిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మండిపడతూ వస్తోంది.

 హీరో సుశాంత్ సింగ్, సీఎం ఎఫెక్ట్

హీరో సుశాంత్ సింగ్, సీఎం ఎఫెక్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) ఆత్మహత్య కేసు విషయంలో రిపబ్లిక్ టీవీ చానల్ లో పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్బంలో రిపబ్లిక్ టీవీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేని కించపరిచే విధంగా చర్చలు జరిపారని ,ఆ వార్తలను ప్రసారం చేసి ప్రజలకు తప్పడు సంకేతాలు పంపించారని శివసేన నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 ఆరోజు నోటీసులు ఇచ్చేసి !

ఆరోజు నోటీసులు ఇచ్చేసి !

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేని కించపరిచే విధంగా టీవీలో వార్తలు ప్రసారం చేసిన రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామిపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకుంటామని గతంలోనే మహారాష్ట్ర శాసనసభ అర్నబ్ గోస్వామికి నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 జస్ట్ ఫైన్ వేసి వార్నింగ్ ఇస్తాం అంతే

జస్ట్ ఫైన్ వేసి వార్నింగ్ ఇస్తాం అంతే

సభాహక్కుల నోటీసులపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, అర్నబ్ గోస్వామికి ఫైన్ (అపరాదరుసుం) విధించి హెచ్చరించి పంపిస్తామని గతంలో మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ ఆయనకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే పిటిషనర్ (అర్నబ్ గోస్వామి)ని బెదిరిస్తూ మీరు లేఖ ఎందుకు రాశారు అనే విషయం రెండు వారాల్లో చెప్పాలని మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీం కోర్టు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

 వేరే దారి లేదా ? లేక

వేరే దారి లేదా ? లేక

అర్నబ్ గోస్వామిని ఎలాగైనా లొంగదీసుకోవాలని ఆయన మీద 2018 నాటి కేసు బయటకు తీశారా ?, సభాహక్కుల నోటీసుల విషయంలో ఆయన తప్పించుకున్నా వేరే మార్గంలో ఆయనకు సినిమా చూపించాలని ఇలా చేశారా ? అంటూ మహారాష్ట్రలోని ప్రతిపక్ష నాయకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చెయ్యడంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి విజయం సాధించినా తరువాత పరిణామాలు ఎలాగుంటాయో ? అనే విషయం త్వరలో తేలిపోనుంది.

 ఏదో జరుగుతోంది ?

ఏదో జరుగుతోంది ?

శనివారం బాంబే హైకోర్టులో అర్నబ్ గోస్వామి బెయిల్ పిటిషన్ పై వానదలు పూర్తి అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇప్పటికే అర్నబ్ గోస్వామిని తమ కస్టడీకి ఇవ్వాలని ముంబాయి పోలీసులు పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అర్నబ్ గోస్వామి అరెస్టును ఖండిస్తూ బీజేపీ సీనియర్ నేతలు మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద, ముంబాయి పోలీసుల మీద దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. మొత్తం మీద అర్నబ్ గోస్వామిని కట్టడి చెయ్యడానికి ఏదో జరుగుతోంది అంటూ అనేక మంది మీడియా ప్రముఖులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+