బోర్న్‌విటా పై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు
బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవలే ఎన్‌సీపీసీఆర్ నిర్ధారించింది. దీంతో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కీలక సూచన జారీచేసింది. బోర్న్ విటా హెల్త్ డ్రింక్స్ కేటగిరిలోకి రాదని, ఈ కేటగిరి నుంచి దీన్ని తొలగించాలని ఈకామర్స్ కంపెనీలను వాణిజ్య మంత్రిత్వశాఖ ఆదేశించింది.
బోర్న్‌విటాలో కోకో స్థాయిలు, చక్కెర అధికంగా ఉన్నట్లు ఓ యూట్యూబర్ తన వీడియోలో విమర్శించారు. అప్పటినుంచే వివాదం మొదలైంది. ఈ స్థాయిలు అధికంగా ఉండటంవల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆ యూట్యూబర్ విమర్శించడంతోపాటు ఎన్‌సీపీసీఆర్ రంగంలోకి దిగింది. సెక్షన్ 14 కింద విచారణ చేపట్టింది. ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006, మోడల్జ్ ఇండియా ఫుడ్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పించిన నియమ, నిబంధనలు 'హెల్త్ కేటగిరి డ్రింక్స్'ను సరిగా నిర్వచించలేదని కేంద్రం వెల్లడించింది.

బోర్న్ విటాలో షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నాయని తేలడంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీచేసింది. పవర్ సప్లిమెంట్ ను హెల్త్ డ్రింక్స్ గా కొన్ని కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయని, మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలు పాటించడంలో పూర్తి గా విఫలమయ్యాయని గతంలోనే భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీని ఎన్‌సీపీసీఆర్ కోరింది. దేశంలోని ఆహార చట్టాల్లో హెల్త్ డ్రింక్ ను రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం నిర్వచించలేదు. దీంతో కంపెనీలు తమ ఉత్పత్తులను ఏమార్చుతూ ప్రచారం చేసుకుంటున్నాయి. అలాగే డెయిరీ ఆధారిత పానీయాలకు హెల్త్ డ్రింక్స్ లేబుల్ వేసి అమ్మొద్దని ఈనెల మొదట్లోలనే ఈ కామర్స్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. ఇలాంటి ఆదేశాలవల్ల బోర్న్ విటా కంపెనీకి సంబంధించిన విక్రయాలు దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications