ఆంటీ ఐలవ్ యూ, లోఫర్ ఐ విల్ కిల్ యూ, భర్తకు తెలీకుండా గానా బజానా, క్లైమాక్స్ లో !
బెంగళూరు/దేవనహళ్లి: కత్తిలాంటి వివాహిత మహిళతో ఓ పెళ్లి కాని యువకుడు అక్రమ సంబందం పెట్టుకున్నాడు. మ్యాటర్ లీక్ కావడంతో ఆంటీ భర్త, కుటుంబ సభ్యులు ప్రియుడికి వార్నింగ్ ఇచ్చారు. అయినా ఇద్దరూ పద్దతి మార్చుకోలేదు. ఆంటీ ఐలవ్ యూ అంటూ ప్రియుడు తిరిగాడు. లోఫర్ ఐవిల్ కిల్ యూ అంటూ భర్త డిసైడ్ అయ్యాడు. క్లైమాక్స్ లో ఆంటీతోనే ఆమె ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించారు. ఆంటీ కోసం వెళ్లిన ప్రియుడిని ఒక కిలోమీటర్ దూరం వెంటాడి వెంటాడి వేటకొడవళ్లతో నరికి చంపేశారు.
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి తాలుకాలోని సంగ్రహళ్లి గ్రామంలో వెంకటేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శ్రీమంతుడు అయిన వెంకటేష్ కు చాలా సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వెంకటేష్ భార్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పక్క గ్రామంలో ప్రదీప్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రదీప్ కు ఇంకా పెళ్లికాలేదు.

వ్యాపారం చేస్తున్న వెంకటేష్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. వెంకటేష్ నివాసం ఉంటున్న గ్రామంలో ఉండే బంధువుల కోసం వెళ్లి వస్తున్న ప్రదీప్ కు ఎర్రగా, నాజుకుగా ఉన్న వెంకటేష్ భార్య పరిచయం అయ్యింది. పెళ్లికాని ప్రదీప్ వెంకటేష్ భార్యకు వలవేసి ఆమెను లొంగదీసుకున్నాడు. రెండు సంవత్సరాల నుంచి ఆంటీతో ప్రదీప్ ఎంజాయ్ చేస్తున్నాడు.
విషయం తెలుసుకున్న వెంకటేష్ అతని భార్యకు, ప్రదీప్ కు పద్దతి మార్చుకోవాలని, లేదంటే ఇద్దరిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. భర్త వెంకటేష్ కు నేరచరిత్ర ఉండటంతో భయపడిపోయిన అతని భార్య ప్రదీప్ ను దూరం పెట్టింది. అయితే ప్రదీప్ మాత్రం వెంకటేష్ భార్యను వదల్లేదు. ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో రహస్యంగా తీసిన వీడియోలు అడ్డం పెట్టుకున్న ప్రదీప్ వివాహిత మహిళను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు.

భయపడిన ఆంటీ ప్రదీప్ ను రహస్యంగా కలవడం మొదలుపెట్టింది. పరిస్థితి చెయ్యిదాటిపోవడంతో ఆంటీ భర్త వెంకటేష్ పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు ప్రదీప్ ను పట్టుకుని చితకబాది పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లోనే ఇరు వర్గాలను రాజీ చేసిన పోలీసులు ఇంకోసారి ఇలా జరిగితే కేసు పెట్టి జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చి పంపించారు.
అయితే ప్రదీప్ మాత్రం ఆంటీని బలవంతంగా బయటకు రప్పించి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసింది. ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రదీప్, ఆంటీ అక్రమ సంబంధం మ్యాటర్ హాట్ టాపిక్ అయ్యింది. ఆంటీ భర్త వెంకటేష్ అవమానంతో ఊగిపోయాడు. గురువారం సాయంత్రం ఆంటీతోనే ప్రదీప్ కు ఫోన్ చేపించారు. సింగ్రేహళ్లి గ్రామం సమీపంలోని కొత్తగా వేసిన లేఔట్ దగ్గరకు వస్తే ఎంజాయ్ చేద్దామని, నువ్వు అక్కడికి రావాలని ప్రదీప్ కు ఆంటీతోనే చెప్పించారు.

ఆంటీ కోసం ఎగేసుకుంటూ వెళ్లిన ప్రదీప్ ను ఆంటీ భర్త వెంకటేష్, అతని బంధువులు కలిసి ప్రదీప్ ను పట్టుకుని చితకబాదేశారు. దెబ్బలు తట్టుకోలేక ప్రదీప్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. నీ భార్యను నేను వదలను అంటూ ప్రదీప్ గట్టిగా కేకలు వేస్తూ పరుగు తీశాడు. ఆ సమయంలో వెంకటేష్, అతని బంధువులకు ఇంకా కోపం ఎక్కువ వచ్చి ప్రదీప్ ను వెంటాడారు.
సింగ్రేహళ్ళి గ్రామం నుంచి సుమారు కిలోమీటరు దూరం ప్రదీప్ ను వెంటాడిన వెంకటేష్ అతని బంధవులు అతన్ని వేటకొడవళ్లతో నరికి కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. ప్రదీప్ ను హత్య చేసిన కొన్ని గంటల్లోనే విశ్వనాథ్ పురం పోలీసులు ఆంటీ భర్త వెంకటేష్ ను పట్టుకున్నారు. ఆంటీ మోజులో పడి ఆమెను టార్చర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసిన ప్రదీప్ దారుణ హత్యకు గురికావడం బెంగళూరు శివార్లలోని దేవనహళ్లి పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications