Boyfriend: లవ్, భర్త బయట ఊర్లో ఉంటే భార్య ?, రాత్రి భార్యకు మందు పార్టీ ఇచ్చి ఏం చేశాడంటే !
బెంగళూరు/నెలమంగల: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కులాలు వేరు అయినా వాళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. భర్త వేరే ఊరిలో పని చేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వెళ్లి రెండురోజులు భార్యతో కలసి ఉంటూ తరువాత పనికి వెళ్లిపోతున్నాడు. తాను బయటపని చేస్తుంటే తన భార్య అక్రమ సంబందం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని భర్త రగిలిపోయాడు. రాత్రి పక్కాప్లాన్ తో భార్యతో మద్యం తాగించాడు. మద్యం మత్తులో నిద్రపోతున్న భార్య గొంతు కోసి ఆమెను హత్య చేసిన భర్త ఎస్కేప్ అయ్యాడు.

లవర్స్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని డాబస్ పేట్ లో శివరాజు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం శివరాజు, మంజుల (32) అనే యువతి ప్రేమించుకున్నారు. ప్రేమికులు శివరాజు, మంజుల చాలా సంతోషంగా తిరిగారు. కులాలు వేరు అయినా శివరాజు, మంజుల పెళ్లికి ఇరువైపుల పెద్దలు అంగీకరించారు.

వేరే జిల్లాలో పని చేస్తున్న భర్త
లవ్ మ్యారేజ్ చేసుకున్న శివరాజు, మంజుల దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. డాబస్ పేటలోనే శివరాజు, మంజుల దంపతులు కాపురం పెట్టారు. తుమకూరు జిల్లాలోని కుణిగల్ లో శివరాజు పని చేస్తున్నాడు. వారానికి ఒకసారి ఇంటికి వెళ్లి రెండురోజులు భార్యతో కలసి ఉంటున్న శివరాజు తరువాత కుణిగల్ లో పనికి వెళ్లిపోతున్నాడు.

ఇంటికి వచ్చిన మరదలు
మంజుల చెల్లెలు శారదాకు అనారోగ్యంగా ఉండటంతో ఆరు నెలల క్రితం డాబస్ పేట్ లోని ఆమె అక్క ఇంటికి వెళ్లింది. ఆరు నెలల నుంచి శివరాజు ఇంటిలోనే అతని భార్య మంజుల చెల్లెలు శారదా ఉంటోంది. ఇంతకాలం శారదా విషయంలో శివరాజ్ అతని భార్య మంజులను ఏమాత్రం ప్రశ్నించలేదు.

భార్య మీద డౌట్ తో మరదలిని ?
తాను బయటపని చేస్తుంటే తన భార్య మంజుల వేరే యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని శివరాజు రగిలిపోయాడు. ఇటీవల ఇంటికి వెళ్లిన శివరాజు అతని భార్య మంజులతో గొడవపడ్డాడు. ఆ సందర్బంలో మంజుల చెల్లెలు శారదా మీద రగిలిపోయి ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశాడు.

భార్యకు మద్యం తాగించి గొంతు కోసి చంపేశాడు
శివరాజు రాత్రి పక్కాప్లాన్ తో ఇంటికే బీరు బాటిల్స్, విస్కీ బాటిల్స్ తీసుకెళ్లాడు. శివరాజు అతని భార్య మంజులతో మద్యం తాగించాడు. మద్యం మత్తులో నిద్రపోతున్న మంజుల గొంతు కోసి ఆమెను హత్య చేసిన శివరాజు ఇంటి బయట గొళ్లెం పెట్టి పరారైనాడు. సమీప బందువు ఇంటికి వెళ్లి చూడటంతో మంజుల హత్యకు గురైన విషయం వెలుగు చూసిందని, శివరాజు కోసం గాలిస్తున్నామని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ మల్లికార్జున చాలదండి మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications