Boys: రోజూ ఎస్ఐ కొడుకు వీరంగం, దెబ్బకు ఢమాల్, నడిరోడ్డులో తండ్రి పరువు తీసేసిన కన్నింగ్ కొడుకు !
చెన్నై: ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి ఎదుటివాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారి కోసం నిత్యం ట్రాఫిక్ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దేశంలోని పలు సిటీలల్లో అయితే అర్దరాత్రి పూట బైక్ రేసింగ్ లు చేస్తూ ఎదుటివాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నియమాలు ఉల్లంఘించి ప్రజలు సంచరించే రహదారుల్లో బైక్ రేసింగ్ లు, వీలింగ్ లు చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా బైక్ రేసింగ్ లు, వీలింగ్ లు చేస్తున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.
అర్దరాత్రి సిటీలోని ప్రధాన రహదారుల్లో బైక్ రేసింగ్ లు చేస్తున్న వారిని, వీలింగ్ చేస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు సిద్దం అయ్యారు. బైక్ రేసింగ్ చేస్తున్న యువకులను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. బైక్ రేసింగ్ చేస్తున్న వారిలో అరెస్టు అయిన వారిలో ఓ పోలీసు అధికారి కొడుకు కూడా ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో బైక్ రేసింగ్, బైక్ వీలింగ్ చేస్తున్న వారిని అరెస్టు చేసిన ఆ పోలీసు అధికారి కొడుకు ఇప్పుడు అలాంటి కేసులో అరెస్టు కావడం కలకలం రేపింది.

విచ్చలవిడిగా రోజూ బైక్ రేసింగ్ లు
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి ఎదుటివాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారి కోసం దేశంలోని అనేక రాష్ట్రాల్లో, నగరాల్లో ప్రతి నిత్యం ట్రాఫిక్ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దేశంలోని పలు సిటీలల్లో అయితే అర్దరాత్రి పూట బైక్ రేసింగ్ లు చేస్తూ ఎదుటివాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

బైక్ రేసింగ్ లు, వీలింగ్ లు
నియమాలు ఉల్లంఘించి పలు నగరాల్లో ప్రజలు సంచరించే ప్రధాన రహదారులు, జాతీయ రహదారుల్లో బైక్ రేసింగ్ లు, వీలింగ్ లు చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా బైక్ రేసింగ్ లు, వీలింగ్ లు చేస్తున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.

అర్దరాత్రి రోడ్లు మీద రెచ్చిపోతున్నారు
చెన్నై సిటీలో ఇటీవ కాలంలో అర్దరాత్రి పూట బైక్ రేసింగ్ లు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చెన్నై సిటీలో అర్దరాత్రి ప్రధాన రహదారుల్లో బైక్ రేసింగ్ లు చేస్తున్న వారిని, వీలింగ్ చేస్తున్న వారిని పట్టుకోవడానికి సిటీ పోలీసులు సిద్దం అయ్యారు. బైక్ రేసింగ్ చేస్తున్న ఐదు మంది యువకులను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.
Recommended Video


ఏఎస్ఐ కొడుకు
బైక్ రేసింగ్ చేస్తున్న వారిలో అరెస్టు అయిన వారిలో చెన్నై సిటీలో పని చేస్తున్న ఓ పోలీసు అధికారి కొడుకు కూడా ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో బైక్ రేసింగ్, బైక్ వీలింగ్ చేస్తున్న వారిని అరెస్టు చేసిన సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీసు అధికారి ధనశేఖరన్ కుమారుడు దివిన్ కుమార్ ఇప్పుడు అలాంటి బైక్ రేసింగ్ కేసులో అరెస్టు కావడం కలకలం రేపింది. ఏఎస్ఐ కొడుకుతో పాటు అరెస్టు అయిన యువకులను విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications