బీపీఎల్ గ్రూప్ ఫౌండర్ గోపాలన్ నంబియార్ కన్నుమూత
బీపీఎల్ (BPL) గ్రూప్ వ్యవస్థాపకులు టీపీ గోపాలన్ నంబియార్ (94) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని నివాసంలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాజీవ్ చంద్రశేఖర్‌కు గోపాలన్ మామయ్య అవుతారు.
దేశీయ కన్జూమర్ బ్రాండ్‌ను నెలకొల్పిన దార్శనికుడు దూరమయ్యారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. గోపాలన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఎంతో బాధించిందని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా, దేశీయ టెలివిజన్ మార్కెట్లో బీపీఎల్ ఎంతో ప్రసిద్ధిగాంచిన విషయం తెలిసిందే. కేవలం టీవీలే కాకుండా.. ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు తయారు చేసే సంస్థగానూ గుర్తింపు పొందింది. ఈ సంస్థను నంబియార్ 1963లో నెలకొల్పారు. ఒక కంపెనీని స్థాపించడానికి అనుమతులు పొందడమే కష్టంగా ఉన్న 'లైసెన్స్ రాజ్' రోజుల్లోనే ఆయన ఈ సంస్థను స్థాపించి ఈ స్థాయికి తీసుకురావడం విశేషం.
మొదట కేరళలోని పాలక్కడ్‌లో బీపీఎల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పినప్పటికీ.. ఆ తర్వాత బెంగళూరుకు మార్చారు. తొలినాళ్లలో రక్షణ దళాలకు సీల్డ్ ప్రెసిషన్ ప్యానెల్ మీటర్లను తయారు చేసింది. ఆ తర్వాతి కాలంలో కలర్ టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు, వీడియో క్యాసెట్లు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది.
It is with great sadness that I inform all abt the passing away of my father-in-law TPG Nambiar, Chairman BPL Group. #OmShanthi 🙏🏻
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) October 31, 2024
He was a true visionary and built one of Indias most trusted consumer brands that remains popular to this day. #BelieveInTheBest
I am pausing my… pic.twitter.com/fmq5qrMbss
1990ల్లో ఎలక్ట్రానిక్ రంగంో బీపీఎల్‌దే తిరుగులేని ఆధిపత్యం కొనసాగింది. అయితే, అంతర్జాతీయ బ్రాండ్లయిన ఎల్జీ, శాంసంగ్, తదితర బ్రాండ్ల ప్రవేశంతో తన వైభవాన్ని కోల్పోయింది. అయినా, బీపీఎల్ బ్రాండ్‌పై విశ్వాసం ఉన్న అనేకమంది కస్టమర్లు ఇప్పటికీ.. ఈ ఉత్పత్తులనే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం గోపాలన్ నంబియార్ తనయుడు అజిత్ నంబియార్ బీపీఎల్‌కు ఛైర్మన్‌గా సీఈవోగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications