'న్యూటన్ కంటే ముందే బ్రహ్మపుత్ర గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టారు'

Posted By:
Subscribe to Oneindia Telugu

జైపూర్: న్యూటన్ కంటే ముందే గురుత్వాకర్షణ గురించి ఆర్యభట్టకు తెలుసునని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ గతంలో చెప్పారు. తాజాగా, రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి కూడా గురుత్వాకర్షణ అంశంపై స్పందించారు. న్యూటన్ కంటే ముందే భారతీయులకు గురుత్వాకర్షణ తెలుసునని చెప్పారు.

ఆవులు ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తాయ‌ని గ‌తంలో విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నాణీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు గురుత్వాకర్షణ గురించి మాట్లాడారు. పాఠ్య‌పుస్త‌కాల్లో చెబుతున్న‌ట్లుగా గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తిని న్యూట‌న్ క‌నిపెట్ట‌లేద‌ని, ఆయ‌న కంటే వెయ్యేళ్ల ముందుగానే రెండో బ్ర‌హ్మ‌గుప్తుడు కనిపెట్టాడ‌ని చెప్పారు.

Brahmagupta II came up with gravitation law 1000 years

రాజ‌స్థాన్ యూనివ‌ర్సిటీ 72వ సంస్థాప‌న దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన వేడుక‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురుత్వాక‌ర్ష‌ణ గురించిన వివ‌రాల‌ను ప్ర‌స్తావించారు.

బ్ర‌హ్మ‌గుప్తుడు చెప్పిన విష‌యాల‌నే ఆధునిక శాస్త్ర‌వేత్త‌లు కొన్ని మార్పులతో సిద్ధాంతాలుగా మారుస్తున్నార‌ని ఆయన చెప్పారు.
వాటి ఆధారంగా పాఠాలు త‌యారై త‌ప్పుడు స‌మాచారాన్ని చేర‌వేస్తున్నాయ‌ని విద్యాశాఖ మంత్రి అన్నారు. మన పాఠ్యాంశాల్లో మన వారిని ఎందుకు చేర్చవద్దని ప్రశ్నించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Seventh-century mathematician Brahmagupta discovered the law of gravity a thousand years before English scientist Isaac Newton did, Rajasthan Education Minister Vasudev Devnani said on Monday. He also wondered why the education curriculum in India ignored this.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి