దేశంలో స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశాలు ఇవే.. ఎలా వెళ్లాలి..?
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో వాయు కాలుష్యం ఒకటి. వాహనాల రద్దీ, పంట వ్యర్థాల కాల్చివేత.. తదితర కారణాల దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది. దిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం 400 పైనే ఉంది. ఇటు హైదరాబాద్ లోనూ వాయు కాలుష్యం పెరుగుతుంది. అయితే దేశంలోనే స్వచ్చమైన గాలి దొరికే ప్రదేశాలు మీకు తెలుసా..? ఈ ప్రదేశాలు పచ్చని కొండల మధ్య ఉండటం వల్ల స్వచ్చమైన గాలిని కలిగి ఉన్నాయి.

ఈ లిస్టులో మేఘాలయాలోని షిల్లాంగ్ తొలి స్థానంలో ఉంది. ఈ ప్రదేశాన్ని స్కాట్ లాండ్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలుస్తారు. పైన్ ఫారెస్ట్.. మంచుతో కప్పబడిన వాతావరణం, కొండలు,.. తదితర కారణాలతో స్వచ్ఛమైన నగరంగా పేరు పొందింది. షిల్లాంగ్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 12 గా ఉంది. పర్వతాల మధ్య నుంచి స్వచ్ఛమైన గాలి ఇక్కడకు వచ్చిన టూరిస్టులకు మరిచిపోలేని అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ప్రదేశానికి అధిక సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు.
ఇక మిజోరాంలోని ఐజ్వాల్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 13 గా ఉంది. చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఈ ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశానికి టూరిస్టులకు బెస్ట్ ఛాయిస్ గా ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటకలోని మదికేరీ ప్రాంతం ఉంది. ఈ ప్రదేశం హైదరాబాద్ కు దగ్గరలో ఉంటుంది. ఇక్కడి కాఫీ తోటలు టూరిస్టులను ఆకర్షిస్తాయి. అలాగే ఈ ప్రాంతంలోనే అబ్బే జలపాతం కూడా ఉంది. మదికేరీ వెళ్లిన పర్యటకులు చాలా ఆహ్లాదకరంగా , రీ ఫ్రెషింగ్ గా ఫీల్ అవుతారు. చుట్టూ పచ్చని తోటలతో కప్పబటి.. జనావాసం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో టూరిస్టులు వెళ్తుంటారు.
ఆ తర్వాతి స్థానంలో కర్ణాటకలోనే గోకర్ణ ప్రాంతం ఉంటుంది. గోకర్ణలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 కంటే తక్కువే ఉంటుంది. పెనిన్సులార్ ఇండియాలో స్వచ్ఛమైన గాలి కలిగిన ప్రాంతంగా గోకర్ణ ఉంది. ఇక్కడి ఓమ్ బీచ్ కూడా టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది శైవక్షేత్రం ఉన్న ప్రాంతం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక ఐదో స్థానంలో తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం అయిన అరుణాచలం.. స్వచ్చమైన గాలి కలిగిన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 33 గా ఉంది. ఇక్కడి స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన ఆలయాలు, ఆలయానికి సమీపంలోనే జలపాతాలు, హిల్ స్టేషన్స్ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications