పెళ్లికూతురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తాళి కట్టిన 10 నిమిషాలకే అసలు ట్విస్ట్!

సాధారణంగా పెళ్లి వేడుక అంటే అందరూ సందడిగా గడుపుతారు. కానీ ఓ స్టార్టప్ వ్యవస్థాపకురాలు మాత్రం తన పెళ్లి ముగిసిన 10 నిమిషాలకే ల్యాప్‌టాప్ పట్టుకుని కూర్చున్నారు. కంపెనీలో తలెత్తిన ఓ కీలకమైన సాఫ్ట్‌వేర్ సమస్యను(క్రిటికల్ బగ్) పరిష్కరించేందుకు ఆమె పెళ్లి దుస్తుల్లోనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

అసలేం జరిగిందంటే?
KoyalAI అనే స్టార్టప్ సీఈఓ మెహుల్ అగర్వాల్, తన సోదరి, కో-ఫౌండర్ అయిన గౌరీ అగర్వాల్‌కు సంబంధించిన ఒక ఫోటోను ఎక్స్‌ (ట్విట్టర్)లో షేర్ చేశారు. ఎర్రటి పెళ్లి దుస్తులు, ఒంటి నిండా నగలతో ఉన్న గౌరీ పెళ్లి వేదికపైనే ల్యాప్‌టాప్ ముందు కూర్చుని సీరియస్‌గా పని చేస్తూ ఆ ఫోటోలో కనిపించారు.

Bride Fixes Software Bug Just 10 Minutes After Wedding Startup Culture Sparks Debate

మెహుల్ తన పోస్ట్‌లో ఇలా రాశారు..
"స్టార్టప్ జీవితం అంటే అందరూ చాలా గ్లామరస్‌గా ఉంటుందని ఊహించుకుంటారు, కానీ అందులో చాలా కష్టం ఉంటుంది. నా సోదరి గౌరీ తన పెళ్లి ముగిసిన కేవలం 10 నిమిషాలకే ఒక క్రిటికల్ బగ్‌ను ఫిక్స్ చేస్తోంది. ఇది ఫోటోల కోసం చేసిన పని కాదు.. ఆ సమయంలో పని చేస్తున్నందుకు మా తల్లిదండ్రులు మా ఇద్దరిపై గట్టిగా అరిచారు కూడా." అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా, గౌరీ తన హనీమూన్‌లో ఉన్నప్పుడు కూడా రోజుకు 3 గంటల పాటు మీటింగ్స్‌లో పాల్గొంటోందని, దీనివల్ల ఆమె భర్త అసంతృప్తిగా ఉన్నారని మెహుల్ సరదాగా మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.

నెట్టింట మిశ్రమ స్పందన
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. కొందరు ఆమె అంకితభావాన్ని మెచ్చుకుంటున్నారు. "విజయం ఊరికే రాదు, ఇలాంటి కష్టం ఉంటేనే సాధ్యం" అని కొనియాడుతున్నారు. మరికొందరు ఇది "టాక్సిక్ వర్క్ కల్చర్" అని విమర్శిస్తున్నారు. "జీవితంలో అతి ముఖ్యమైన క్షణాలను కూడా పని కోసం త్యాగం చేయడం సరికాదు" అని హితవు పలుకుతున్నారు. "ఇది పని పట్ల గౌరవం కాదు, టైమ్ మేనేజ్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్‌లో వైఫల్యం" అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్ ప్రపంచంలో ఉండే పని ఒత్తిడిని ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. అయితే పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత అవసరమని ఈ వైరల్ పోస్ట్ మరోసారి గుర్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+