గ్రాండ్‌గా రిసెస్షన్: ప్రేమికుడి కోసం కాబోయే భర్తకు హ్యాండిచ్చిన వధువు

బెంగుళూరు: పెళ్లి మంటపంలో రిసెప్షన్ ముగిసిన కొన్ని గంటలకే వరుడికి హ్యాండ్ ఇచ్చి వధువు పారిపోవడంతో పెళ్లి ఆగిపోయిన సంఘటన బెంగుళూరులో జరిగింది. కామాక్షిపాళ్య పోలీసుల వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. కుణిగల్‌కు చెందిన రామచంద్రప్పకు బెంగళూరులోని లగ్గెరెకు చెందని ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది.

సోమవారం వీరి పెళ్లి మాగడి రోడ్డులోని సుంకదకట్టెలో ఉన్న విజయచంద్ర కల్యాణమంటపంలో జరపడానికి పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణమంటపంలో తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయిన వధువు, తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో సహా కనిపించకుండా పోయింది.

Bride is gone with lover ofter reception

సోమవారం ఉదయం తెల్లవారుజామున పెళ్లి జరిపించేందుకు గదిలోకి వెళ్ళి చూడగానే వధువు కనిపించలేదు. కొంతసేపటి తర్వాత వధువు తన తల్లికి ఫోన్ చేసి తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసిన వరుడి తరుపు బంధువులు రాద్ధాంతం చేశారు.

పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని ఇరువైపులా వారి నచ్చజెప్పి అదే ముహూర్తానికి మరో యువతితో పెళ్లి జరిపించేందుకు యత్నించారు. మొదట పెళ్లి కుమారుడు ఒప్పుకున్నా, చివరి నిమిషంలో ఆమె కంటే రెండేళ్లు పెద్దదని తెలియడంతో పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకుని తేల్చి చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే వధువు పరారీపై కామాక్షిపాళ్య పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+