Video : బీహార్లో కుప్పకూలిన రూ.14 కోట్ల వంతెన- ప్రారంభానికి ముందే ఘటన..
బీహార్ లోని బెగూసరాయ్ జిల్లాలో ఇవాళ ఓ భారీ వంతెనలో ఓ భాగం కుప్పకూలింది. రూ.14 కోట్ల రూపాయలతో తాజాగా నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. తాజాగా గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన నుంచి కోలుకోకముందే బీహార్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
బీహార్లోని బెగూసరాయ్ లో ఉన్న సాహెబ్ పూర్ కమాల్ లో తాజాగా నిర్మించిన ఓ వంతెనలో మధ్య భాగం ఇవాళ అనూహ్యంగా కుప్పకూలింది. బుర్హీ గండక్ నదిపై నిర్మించిన ఈ వంతెన మధ్యలో కొంతభాగం కుప్పకూలి నదిలో పడిపోయింది. అయితే ప్రమాద సమయంలో ఈ వంతెనపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఈ వంతెన నిర్మాణం పూర్తయినా ప్రస్తుతం వాడకంలో లేదని, కుప్పకూలడం వెనుక కారణాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సాహెబ్ పూర్ కమాల్ వద్ద నిర్మించిన ఈ వంతెన బీహార్లోని అహోక్-బిషన్ పూర్ లను కలిపేలా నిర్మించారు. ఘటనతో ఉలిక్కిపడ్డ అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. 2016లో నిర్మించిన ఈ వంతెన ప్రారంభం మాత్రం కాలేదు. ఆ లోపే ఇలా కుప్పకూలడంపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని వారు చెప్తున్నారు.
#WATCH | Bihar: A portion of a bridge that was built across Burhi Gandak River in Sahebpur Kamal, Begusarai collapsed and fell into the river yesterday. The bridge had developed cracks a few days back. Nobody was on the bridge at the time of the incident. pic.twitter.com/zB7L3bAOPA
— ANI (@ANI) December 19, 2022












Click it and Unblock the Notifications