Gift Blast: హోం థియేటర్ పేలుడు కేసులో ట్విస్ట్.. ప్రియుడే నిందితుడు..
ఛత్తీస్ గడ్ కబీర్ ధామ్ జిల్లాలో సోమవారం ఓ ఇంట్లో పెళ్లి కానుకగా వచ్చిన హోమ్ థియేటర్ ను ఓపెన్ చేయగా అది పేలిపోయింది. ఈ ఘటనలో పెళ్లి కుమారుడితో పాటు అతని తమ్ముడు మృత్యవాత పడ్డారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉంది. చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి, అంజానా గ్రామానికి చెందిన యువతికి రెండు రోజుల క్రితం పెళ్లి అయింది. పెళ్లిలో బంధుమిత్రులు, స్నేహితుల నుంచి వారికి గిఫ్ట్ లు వచ్చాయి.
సోమవారం ఉదయం 11:30 గంటలకు హేమేంద్ర ఇంటికి తెచ్చిన పెళ్లి కానుకలను ఓపన్ చేసి చూశారు. అందులో వారికి ఒక హోమ్ థియేటర్ ఉంది. దీంతో తన కుటుంబసభ్యులతో కలిసి హోమ్ థియేటర్‌ను సెట్ చేసి ఆన్ చేశాడు. అయితే హోమ్ థియేటర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు దాటికి ఇంటి పై కప్పు ఎగిరిపోయింది. హోం థియేటర్ లో గన్ పౌడర్ ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజమైంది.

ఈ ఘటనలో విస్తుపోయే నిజం బయటపడింది. కొత్త హత్య చంపేందుకు ఆ హోం థియేటర్‌లో బాంబు పెట్టి గిఫ్ట్ ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తేలింది. పెళ్లి కూతరు మాజీ ప్రియుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిసింది. పోరెన్సిక్ ల్యాబ్ వారు హోం థియేటర్ లో గన్ పౌడర్ ఉందని గుర్తించింది. దీంతో బహుమతి ఎవరు ఇచ్చారో తెలుకునే ప్రయత్నం చేశారు. పెళ్లి వీడియోలో హోం థియేటర్ గిఫ్ట్ ఎవరు ఇచ్చారో గుర్తించారు.
పెళ్లి కుమార్తె మాజీ ప్రియుడు, మధ్యప్రదేశ్‌కు చెందిన సర్జు మార్కమ్ ఉద్దేశపూర్వకంగా ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. పెళ్లికి ముందు వధువు, సర్జు ప్రేమించుకున్నట్లు విచారణలో తేలింది. ఇయితే ఆమె అతన్ని కాదని వేరే అబ్బాయితో వివాహానికి సిద్ధమైంది. దీంతో ఆమెను చంపాలని సర్జు నిర్ణయించుకున్నాడు. హోం థియేటర్ కొనుగోలు చేశాడు. అందులో బాంబును అమర్చి రిసెప్షన్ రోజున వారికి కానుకగా ఇచ్చాడు. పోలీసులు నిందితుడు సర్జును మంగళవారం అరెస్ట్ చేశారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications