చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Girl: బాయ్ ఫ్రెండ్ తో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడిన చెల్లెలు, గొంతుకోసి చంపేసిన అన్న !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ పళని: తండ్రి చనిపోవడంతో అన్న ఆ కుటుంబాన్ని నెట్టుకుని వస్తున్నాడు. ఈ కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకోవడానికి వారి బంధువులు ఆ ఇంటికి వచ్చి వెలుతున్నారు. వయసుకు వస్తున్న ఇదే ఇంటిలోని అమ్మాయి ప్రతిరోజు బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుందని ఆమె అన్నకు తెలిసింది. నువ్వు పద్దతి మార్చుకోవాలని అమ్మాయికి ఆమె అన్న హెచ్చరించాడు. అన్నమాట లెక్క చెయ్యకుండా ఆ అమ్మాయి ఫోన్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ తో గంటలు గంటలు మాట్లాడింది. అన్నా, చెల్లిలి మద్య ఇదే విషయంలో గొడవ జరిగింది. సహనం కోల్పోయిన అన్న కత్తి తీసుకుని చెల్లెలు గొంతు కోసి చంపేశాడు. బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్న అమ్మాయిని ఆమె అన్న హత్య చెయ్యడం కలకలం రేపింది. అమ్మాయితో ఫోన్ మాట్లాడుతూ ఆమె హత్యకు పరోక్షంగా కారణం అయిన ఆ యువకుడు ఇప్పుడు మాయం అయ్యాడు.

Illegal affair: భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త, హోటల్ లో ఏసీ రూమ్ లో సెక్రటరీతో !Illegal affair: భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త, హోటల్ లో ఏసీ రూమ్ లో సెక్రటరీతో !

 తండ్రి చనిపోయాడు

తండ్రి చనిపోయాడు

తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని పళనిలో గణపతి ప్రాంతంలో మురగేశన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మురగేశన్ భార్య సంగలిమ్మయ్యార్ వికలాంగురాలు. మురగేశన్ కుమారుడు కార్తీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మురగేశన్ చనిపోయాడు.

 ఫ్యామిలీని చూసుకుంటున్న అన్న

ఫ్యామిలీని చూసుకుంటున్న అన్న

మురగేశన్ చనిపోయిన తరువాత ఆయన కొడుకు కార్తీ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. తండ్రి చనిపోవడంతో కార్తీ ఆ కుటుంబాన్ని నెట్టుకుని వస్తున్నాడు. మురగేశన్ కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకోవడానికి వారి బంధువులు ఆ ఇంటికి వచ్చి వెలుతున్నారు.

 16 ఏళ్ల అమ్మాయి

16 ఏళ్ల అమ్మాయి

కార్తీకి గాయిత్రీ (16) అనే చిన్న చెల్లెలు ఉంది. కార్తీ సొంత పెద్దమ్మ కొడుకు బాలమురుగన్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. బాలమురుగన్ అప్పుడప్పుడు కార్తీ ఇంటికి వచ్చి వెలుతున్నాడు. వయసుకు వస్తున్న గాయిత్రీ ప్రతిరోజు ఆమె బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుందని ఆమె పెద్దమ్మ కొడుకు బాలమురుగన్ కు తెలిసింది.

 చెల్లెల్లి గొంతుకోసి చంపేసిన అన్న

చెల్లెల్లి గొంతుకోసి చంపేసిన అన్న

నువ్వు పద్దతి మార్చుకోవాలని గాయిత్రీకి ఆమె అన్న బాలమురుగన్ హెచ్చరించాడు. బాలమురుగన్ మాట లెక్క చెయ్యకుండా గాయిత్రీ ఫోన్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ తో గంటలు గంటలు మాట్లాడింది. అన్నా, చెల్లిలి మద్య ఇదే విషయంలో గొడవ జరిగింది. సహనం కోల్పోయిన బాలమురుగన్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని చెల్లెలు గొంతు కోసేశాడు.

Recommended Video

కేంద్ర రాష్ట్ర విదానాలపై మండి పడ్డి ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్!
 మాయం అయిపోయన బాయ్ ఫ్రెండ్

మాయం అయిపోయన బాయ్ ఫ్రెండ్

గాయిత్రీని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గాయిత్రీ ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్న గాయిత్రీని ఆమె పెద్దమ్మ కొడుకు బాలమురుగన్ హత్య చెయ్యడం కలకలం రేపింది. గాయిత్రీతో ఫోన్ మాట్లాడుతూ ఆమె హత్యకు పరోక్షంగా కారణం అయిన ఆ యువకుడు ఇప్పుడు మాయం అయ్యాడు. గాయిత్రీని హత్య చేసిన బాలమురుగన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కార్తీకి అతని చిన్న చెల్లెలు గాయిత్రీ అంటే ప్రాణం అని, తన చెల్లెలు వేరే అబ్బాయితో మాట్లాడుతోందని పెద్దనాన్న కొడుకు బాలమురుగన్ హత్య చేశాడని తెలుసుకుని అతను ఆర్తనాదాలు చేస్తున్నాడు.

English summary
Girlfriend: Brother kills sister as she talked with her boyfriend for a long time in Palani in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X