Illegal affair: మార్కెట్ లో వదిన, మరిది ?, బాహుబలి టైపులో కత్తితో అన్న, జస్ట్ మిస్ !
చెన్నై/ తిరుచ్చి: వరుసకు వదిన అయ్యే మహిళతో ఓ యువకుడి పిచ్చపాటిగా మాట్లాడుతున్నాడు. విషయం తెలుసుకున్న భర్త మొదట భార్యకు బుద్దిమాటలు చెప్పాడు. అయితే ఇంటి బయట కలుస్తున్న భార్య, ఆమె మరిది హ్యాపీగా తిరగడం మొదలుపెట్టారు. తన భార్య వేరే వ్యక్తితో తిరుగుతోందని ఫ్రెండ్స్ చెప్పడంతో భర్త రగిలిపోయాడు. నీ పద్దతి మార్చుకోమని అన్న అతని తమ్ముడికి వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి వార్నింగ్ లు మామూలే అంటూ అతని మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు. మార్కట్ ప్రాంతంలో వదిన, ఆమె మరిది చట్టాపట్టాలు వేసుకుని మాట్లాడుకుంటూ వెలుతున్న సమయంలో ఆమె భర్త చూశాడు. అంతే నడుములో ఉన్న కత్తి తీసుకుని భర్త బాహుబలి టైపులో తమ్ముడి మీద ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. అన్న తమ్ముడి మీద కత్తితో దాడి చేస్తున్న సమయంలో మార్కెట్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ క్లిపింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి.

యవ్వనంలో ఉన్న భార్య
తమిళనాడులోని తిరుచ్చిలోని పిళ్లైమనగర్ ప్రాంతంలో అరుణ్ (29), విజేత దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం అరుణ్, విజేత దంపతులకు వివాహం అయ్యింది. యవ్వనంలో ఉన్న విజేత ఆమె భర్త అరుణ్ తో కలిసి సంతోషంగా కాపురం చేస్తోంది. పని మీద ఎక్కువగా బయట తిరుగుతున్న భర్త అరుణ్ రాత్రి ఇంటికి వెళ్లి భార్య విజేతతో గడుపుతున్నారు.

మరిది ఎంట్రీతో భార్యకు హ్యాపీ
అరుణ్ కు చిన్నాన అయిన పెరియప్పన్ తిరుచ్చిలోనే నివాసం ఉంటున్నాడు. పెరియప్పన్ కు జాక్సన్ అనే కుమారుడు ఉన్నాడు. వరుసకు అన్న అయ్యే అరుణ్ ఇంటికి జాక్సన్ వెళ్లేవాడు. నిత్యం అన్న అరుణ్ ఇంటికి వెలుతున్న జాక్సన్ వదిన విజేతతో మాట్లాడుతున్నాడు. రొమాన్స్ గా మాట్లాడుతున్న జాక్సన్ ను చూసి వదిన విజేత హ్యీపీగా ఫీల్ అయ్యేదని తెలిసింది.

పెళ్లికాని కుర్రాడు హాట్ గా ఉన్నాడని ?
జాక్సన్ కు ఇంకా పెళ్లి కాలేదు. వదిన విజేతతో తరచూ మాట్లాడుతున్న జాక్సన్ ఆమెకు దగ్గర అయ్యాడు. సెక్సీ మాటలతో డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడుతున్న జాక్సన్ కు అతని వదిన విజేత ఆకర్షితురాలైయ్యింది. పెళ్లి కాని మరిది చిక్కాడని విజేత ఎగిరి గంతేసింది. అంతే అక్కడి నుంచి అసలు సినిమా మొదలైయ్యింది.

విపరీతమైన అనుమానం
తన భార్య విజేతతో తన తమ్ముడు జాక్సన్ ఎందుకు అంత చనువుగా ఉంటున్నాడని అతని అన్న అరుణ్ కు అనుమానం మొదలైయ్యింది. ఇదే సమయంలో ఇంట్లోనే విజేత ఆమె మరిది జాక్సన్ తో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. ఉదయం నుంచి రాత్రి అరుణ్ ఇంటికి వెళ్లే వరకు జాక్సన్ అతని ఇంటిలోనే వదిన విజేతతో రొమాన్స్ చేస్తూ బిజీ అయిపోయాడు.

ఇద్దరికి వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్
నువ్వు చేస్తున్న పని ఏమీ బాగాలేదని, నీకు వరుసకు మరిది అయ్యే జాక్సన్ తో ఎందుకు చనువుగా ఉన్నావని, నీ పద్దతి మార్చుకోవాలని భర్త అరుణ్ అతని భార్య విజేతకు బుద్దిమాటలు చెప్పాడు. మా ఇంటి దగ్గరకు రావద్దని, నీ పద్దతి బాగాలేదని అరుణ్ అతని తమ్ముడు జాక్సన్ కు ఇంతకు ముందే సార్లు చెప్పాడు.

ఇంట్లో ఎందుకు.... బయట కలుద్దాం
భర్త వార్నింగ్ ఇవ్వడంతో విజేత కొన్ని రోజులు సైలెంట్ గా ఉంది. తరువాత మనం బయట కలుద్దామని మరిది జాక్సన్ కు చెప్పింది. అప్పటి నుంచి భర్త అరుణ్ కు తెలీకుండా జాక్సన్, అతని వదిన విజేత బయటకలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరగడం మొదలుపెట్టారు. నీ భార్య విజేత నీ తమ్ముడు జాక్సన్ తో ఎక్కువగా బయట కనపడుతోందని, ఏమిటి విషయం ? అంటూ ఫ్రెండ్స్ ప్రశ్నించడంతో అరుణ్ కు ఎక్కడో కాలిపోయింది.

మార్కెట్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు
చాలా రోజుల నుంచి బయట తిరుగుతున్న భార్య విజేత, తమ్ముడు జాక్సన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అరుణ్ ప్రయత్నిస్తున్నాడు. రాత్రి పొద్దుపోయిన తరువాత తిరుచ్చి మార్కెట్ లో జాక్సన్, విజేత కలుసుకుని మాట్లాడుకుంటున్న సమయంలో అరుణ్ అక్కడికి వెళ్లాడు. . కరోనా కారణంగా ఇప్పుడు లాక్ డౌన్ విదించారని, ఇలాంటి సమయంలో ఇంత రాత్రి నీకు ఇక్కడ ఏం పని అంటూ భర్త అరుణ్ భార్య విజేతను ప్రశ్నించాడు. పక్కనే ఉన్న జాక్సన్ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు.

బాహుబలి టైపులో రెచ్చిపోయిన అన్న.....జస్ట్ మిస్
ఆ సమయంలో సహనం కోల్పోయిన అరుణ్ నడుములో పెట్టుకున్న కత్తి తీసుకుని బాహుబలి టైపులో రెచ్చిపోయి తమ్ముడు జాక్సన్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచేసేశాడు. తీవ్రగాయాలైన జాక్సన్ కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు జాక్సన్ ను తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాక్సన్ పరిస్థితి విషమంగా ఉందని, అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, అరుణ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు అచెప్పారు. మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో అరుణ్ అతని తమ్ముడు జాక్సన్ ను కత్తితో పోడుస్తున్న సమయంలో రికార్డు అయిన వీడియో క్లిప్పింగ్స్ బయటకు రావడంతో అవి వైరల్ అయ్యాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications