ఉద్యోగులకు షాక్: ఆదాయ పన్నుపై వేతన జీవులకు ఊరటనివ్వని జైట్లీ
Recommended Video

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్నుపై ఊరట లభించలేదు. వ్యక్తిగత ఆదాయపన్నులో ఎలాంటి మార్పు లేదు. ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలకు లేదా కనీసం రూ.3 లక్షలకు మినహాయింపు ఉంటుందని వేతన జీవులు ఆశపడ్డారు.
కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వేతనజీవులు నిరాశకు గురయ్యారు. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు లేకపోవడంతో వచ్చే ఎన్నికలపై ప్రభావం ఏ మేర ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.

కొత్తగా 81 లక్షల రిటర్న్స్
బడ్జెట్ ప్రసంగం సమయంలో జైట్లీ మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా5 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలైనట్లు తెలిపారు. రూ.90వేల కోట్లు అదనంగా వచ్చాయని తెలిపారు. ఆదాయపన్ను పరిధిలోకి కొత్తగా 5 లక్షలమంది వచ్చారని చెప్పారు. వ్యక్తిగత ఆదాయపన్ను రాబడిలో 11 శాతం అభివృద్ధి ఉందన్నారు.

పన్ను రిటర్న్ దాఖలు చేసే వారి సంఖ్య
పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 40 శాతానికి పెరిగింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుల కింద అదనంగా రూ.90వేల కోట్ల సేకరణ. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 85.51కోట్లుగా ఉంది.

స్టాండర్డ్ డిడక్షన్ రూ.40 వేల వరకు
వేతన ఉద్యోగులకు రూ.40వేల వరకు ప్రయాణ, వైద్య ఖర్చులకు స్టాండర్డ్ డిడక్షన్ వర్తింపు. సీనియర్ సిటిజన్లకు వైద్య ఖర్చులకు అదనపు రాయితీ. దీనివల్ల 2.5 కోట్లమందికి లబ్ధి. ప్రత్యక్ష పన్నుల్లో 12.6శాతం వృద్ధి. గత రెండేళ్లుగా ఆదాయపన్ను వసూళ్లలో భారీ పెరుగుదల.

సీనియర్ సిటిజన్లకు
బిట్ కాయిన్ ఐటీ స్కానర్ పరిధిలో ఉందని జైట్లీ చెప్పారు. వృద్ధుల ఎఫ్‌డీ, పోస్టాఫీస్ డిపాజిట్లపై టీడీఎస్ ఉండదు. రూ.50వేల వరకూ వర్తింపు. సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు అదనపు రాయితీ రూ.60వేల నుంచి రూ.లక్షలకు పెంపు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications